మ్యూచ్‌‌వల్ ఫండ్స్ చాలా కాలం నుండి ఉన్నాయా?

మ్యూచ్‌‌వల్ ఫండ్స్ చాలా కాలం నుండి ఉన్నాయా?
కాలిక్యులేటర్లు

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

కొంత కాలం ప్రపంచం అంతటా విభిన్న సాంప్రదాయ ఫార్మాట్లలో కలెక్టివ్ మరియు పూల్డ్ ఇన్వెస్ట్‌‌మెంట్లు ఉన్నాయి. మ్యూచ్‌‌వల్ ఫండ్స్ మనకు తెలిసి 1924 నుండి మాసాచుసెట్స్ ఇన్వెస్టర్స్ ట్రస్ట్‌ ఏర్పాటుతో ప్రారంభమయ్యాయి.

మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ పెరుగుదల మూడు విస్తారమైన ట్రెండ్లను కలిగి ఉన్నది:

  1. మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో అసెట్లలో ప్రశంసనీయమైన గ్రోత్ - మరింత మంది ఇన్వెస్టర్లు మ్యూచు‌వల్ ఫండ్స్‌ని అంగీకరించారు.
  2. కఠినతరమైన నియంత్రణ - ఇన్వెస్టర్‌ పరిరక్షణని మరియు ఫండ్ మేనేజ్‌మెంట్ ఇండస్ట్రీ యొక్క సరియైన పర్యవేక్షణని ధృవీకరిస్తుంది.
  3. మరిన్ని సృజనాత్మక ఉత్పత్తుల పరిచయం కాగా – అవి విభిన్న కస్టమర్ల అవసరాలకు సరిపోతాయి ; దీర్ఘకాల రిటైర్మెంట్ ప్లాన్ నుండి తక్కువ కాల క్యాష్ మేనేజ్‌మెంట్ వరకు.

ఇండియాలో మ్యూచ్‌‌వల్ ఫండ్స్ 1963 నుండి, యూనిట్ ట్రస్ట్‌ ఆఫ్ ఇండియా (యుటిఐ) స్థాపించినప్పటి నుండి ఉన్నాయి. యుటిఐ భారత ప్రభుత్వం మరియు భారతీయ రిజర్వ్ బ్యాంకు ద్వారా స్థాపించబడినది. 1964లో ప్రారంభించబడిన యూనిట్ స్కీము 64, మొదటి మ్యూచ్‌‌వల్ ఫండ్ స్కీము.

1987లో, ఇతర పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు మరియు సంస్థలు మ్యూచువల్ ఫండ్స్ ప్రారంభించడానికి అనుమతించబడినాయి. 1993లో, లిబరలైజేషన్ వేవ్ తరువాత, ప్రైవేట్ సెక్టార్ మరియు విదేశీ ప్రాయోజితులు మ్యూచు‌వల్ ఫండ్స్ ప్రారంభించడానికి అనుమతించబడ్డారు.

మ్యుచువల్ ఫండ్ ఇండస్ట్రీ వేగంగా పరిమాణం, నైపుణ్యం మరియు పెట్టుబడిదారులని చేరుకోవడం వేగంగా సాధించింది. డిసెంబర్ 31, 2016 నాటికి, ఇండియాలో మ్యూచ్‌‌వల్ ఫండ్స్ 16.93 లక్ష కోట్లు మించిన అసెట్లను నిర్వహించింది.

పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను