ఈక్విటీ మరియు డెబిట్ ఫండ్ మధ్య తేడా ఏమిటి?

ఈక్విటీ మరియు డెబిట్ ఫండ్ మధ్య తేడా ఏమిటి? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

“మ్యూచువల్ ఫండ్స్ అన్నీ ఒకటే కాదా? చివరికి, ఇది ఒక మ్యూచువల్ ఫండే, కాదా?” అని గోకుల్ అడిగాడు. అతని స్నేహితుడు హరీష్, ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, నవ్వాడు. చాలా మంది నుంచి వచ్చే అటువంటి మాటలు అతడికి అలవాటైనవే.

అన్ని మ్యూచువల్ ఫండ్స్ ఒకటే అనే దురభిప్రాయం చాలా మందిలో ఒకటిగా ఉన్నది. మూడు రకాల ఫండ్స్ ఉన్నాయి వీటిలో ముఖ్యంగా ఈక్విటీ ఫండ్స్ మరియు డెబిట్ ఫండ్స్ ఉన్నాయి. రెండింటి మధ్య తేడా ఎక్కడ డబ్బు ఇన్వెస్ట్ చేసామో,దాన్ని బట్టి వస్తుంది. డెబిట్ ఫండ్స్ ఫిక్సిడ్ ఇన్కం సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేయగా, ఈక్విటీ ఫండ్స్ ముఖ్యంగా ఈక్విటీ షేర్ మరియు సంబంధింత సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈక్విటీ మరియు ఫిక్సడ్ ఇన్కం సెక్యూరిటీలు రెండిటికీ సంబంధిత స్కీములు ఎలా ప్రవర్తిస్తాయో విభిన్న లక్షణాలను బట్టి ఉంటాయి.

విభిన్న ఇన్వెస్టర్లకు విభిన్న అవసరాలు ఉంటాయి. వాటి లక్ష్యాలను సాధించడానికి కొన్నింటికి అధిక రిటర్నులు కావాలి, కాగా కొన్ని అధిక రిస్కులను భరించలేవు. కొందరు ఇన్వెస్టర్లకు లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి, కాగా కొందరికి షార్ట్ నుండి మీడియం టర్మ్ లక్ష్యాలు ఉంటాయి. పెట్టుబడిదారుడు లాంగ్ టర్మ్ లక్ష్యాల కొరకు ఒక ఈక్విటీ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు, షార్ట్ నుండి మీడియం టర్మ్ లక్ష్యాల కొరకు డెబిట్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీ ఫండ్స్‌కు అధిక రిటర్నులు అందించే శక్తి ఉంది, కానీ రిస్కుతో, కాగా డెబిట్ ఫండ్స్ వాటితో పోలిస్తే స్థిరమైనవి కానీ ఓమోస్తరు నుండి తక్కువ రిటర్నులను అందిస్తాయి.

408
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను