మ్యూచ్‌‌వల్ ఫండ్స్‌లో నేను ఎలా పెట్టుబడి ప్రారంభించవచ్చు?

మ్యూచ్‌‌వల్ ఫండ్స్‌లో నేను ఎలా పెట్టుబడి ప్రారంభించవచ్చు?
కాలిక్యులేటర్లు

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మ్యూచ్‌‌వల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి మీరు కొన్ని ప్రాథమిక అవసరాలను పూర్తి చేయాలి. అట్టి అవసరాలు అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఎఎమ్‌సి)తో నేరుగా వారి ఆఫీసు వద్ద గానీ లేదా ఆథరైజ్డ్ పాయింట్ ఆప్ యాక్సెప్టెన్స్ (పిఒఎ) లేదా అధికారిక మధ్యవర్తి అయిన అడ్వైజర్, బ్యాంకర్, డిస్ట్రిబ్యూటర్ లేదా బ్రోకర్ ద్వారా గానీ పూర్తి చేయవచ్చు.

మ్యూచ్‌‌వల్ ఫండ్ స్కీములో ఇన్వెస్ట్‌ చేయడానికి ముందు, మీరు నో యువర్ కస్టమర్ (కెవైసి) ప్రక్రియని పూర్తి చేయాలి. పూర్తిచేసిన కెవైసి పత్రమును స్కీము దరఖాస్తు పత్రముతో (కీ ఇన్‌ఫర్మేషన్ మెమోరాండం అని కూడా అంటారు) సబ్మిట్ చేయాలి. అకౌంట్ హోల్డర్ల పేరు, పిఎఎన్ నంబర్లు, బ్యాంకు అకౌంట్ వివరాలు మొదలగు ముఖ్యమైన వివరాలను గ్రహిస్తుంది కావున దరఖాస్తు పత్రాన్ని జాగ్రత్తగా నింపాలి. దీని పైన అందరు అకౌంట్ హోల్డర్లు సంతకం చేయాలి. వీటిలో చాలా వరకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారాల్లో కూడా చేయవచ్చు.

కొత్త ఇన్వెస్టర్లు మొత్తం ప్రాసెస్ సున్నితంగా మరియు సులువుగా చేయడానికి, వారి అడ్వైజర్ నుండి సలహాని తీసుకోవచ్చు. మరియు ఇన్వెస్ట్‌ చేయడానికి ముందు, అందరూ ఇన్వెస్టర్లు ముఖ్యమైన స్కీముకు సంబంధించి డాక్యుమెంట్లు చదవాలని మరియు వారు ఎంపిక చేసుకున్న స్కీము రిస్కులను తెలుసుకోవాలని సూచించడమైనది.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను