మ్యూచువల్ ఫండ్లతో మీ పదవీ విరమణకు ప్లాన్ చేసుకోవడం ఎలా?

Video

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

చాలా మంది తాము పదవీ విరమణ దగ్గరకు వచ్చేంతవరకు పదవీ విరమణ గురించి ఆలోచించరు. ఉద్యోగం చేసినంత కాలం సొంత వాహనం, ఇల్లు, కుటుంబ పోషణ, పిల్లల చదువు, వారి వివాహాలు అంటూ ఒకదాని తరువాత ఒక అవసరం పూర్తి చేయడంలో గడిచిపోతుంది. ఈ బాధ్యతలను అన్నింటినీ చూసుకున్న తరువాత, దగ్గరికి వచ్చిన పదవీ విరమణ తరువాతి జీవితానికి ఎంత మిగిలి ఉందో చూడటం మనం ప్రారంభిస్తాము. అప్పుడే ప్రజలు పదవీ విరమణ దశ ప్రారంభం కావడానికి ముందే స్పల్ప వ్యవధిలో వేగంగా రాబడులు ఇచ్చే వేటిలోనైనా తమ సేవిగ్స్‌ను పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచించడం మొదలు పెడతారు. వారికి అత్యధిక సౌకర్యం, భద్రత, మంచి ఆరోగ్య సంరక్షణ మరియు నియమిత ఆదాయం లేకుండా 15-30 సంవత్సరాలు జీవనాధారం అవసరమైన జీవితపు ఆ దశ కోసం ప్లాను చేసుకోవడానికి ఇది తప్పు పద్ధతి. 

ఈ దశ కోసం ప్లానింగ్ చేయడం తప్పక వీలైనంత ముందుగానే ప్రారంభం కావాలి. మీ సంపాదనలు మరియు జీవనశైలి ఏవైనప్పటికీ, మీ ఖర్చులు అన్నీ పోను, మీరు ఆర్థిక నిబద్ధతలు అన్నీ తీరిన తరువాత, కారు నెల వాయిదా, గృహ ఋణం నెల వాయిదా, పిల్లల కోసం పెట్టుబడి, అత్యవసర ఫండు అన్నీ చెల్లించిన తరువాత ప్రతి నెల తప్పక కొంత డబ్బు మిగులుతుంది.  ఆ డబ్బు చిన్న మొత్తం అయినప్పటికీ, తగిన ఇన్‌స్ట్రుమెంట్‌లో దాన్ని పెట్టుబడి పెట్టడం అనేది దీర్ఘకాలంలో మీరు సంపద సృష్టించడానికి సహాయపడగలదు. దీనికి మ్యూచువల్ ఫండ్ల కంటే మంచి ఇన్‌స్ట్రుమెంట్ ఏముంది? మీరు ప్రతి నెల ఎస్‌ఐపి ద్వారా నెలకు 500 రూపాయలు అంత చిన్న మొత్తాన్ని మ్యూచువల్ పండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు మరియు మీ ఆదాయం/పొదుపులు పెరిగేకొద్దీ ఆ మొత్తాన్ని పెంచవచ్చు. కూర్పు యొక్క శక్తి చూపిన మ్యాజిక్ చూసినప్పడు మీకు ఆనందంతో కూడిన ఆశ్చర్యం కలుగుతుంది, బంగారు గుడ్ల బుట్టలో పడ్డారు అనే సామెత మీకు నిజం అవుతుందేమో ఎవరికి తెలుసు!

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను