ఏవైనా రెండు స్కీమ్ల పని సామర్థ్యాన్ని ఎవరైనా ఎలా పోల్చాలి

Video

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మీరు ఒక కారు కొనాలనుకుంటే, మీరు మోడల్స్ను ఎలా షార్ట్లిస్ట్ చేస్తారు? మీరు మొదట క్రొత్త  మోడళ్లను ఎంచుకుంటారా లేక కారు రకం నిర్ణయిస్తారా? మీకు ఇంకా నిశ్చితంగా తెలియకపోతే, మీరు ఒక డీలరు దగ్గరకు వెళ్తారు, వారు మిమ్మల్ని అడిగే మొదటి ప్రశ్న, మీరు ఏ రకం కారు కోసం చూస్తున్నారు? అని, ఉదా. ఎస్యువి, హ్యాచ్బ్యాక్, సెడాన్. 

మ్యూచువల్ ఫండ్స్ పని సామర్థ్యం పోల్చడంలో కూడా అదే జరుగుతుంది. వివిధ కేటగిరీలకు చెందిన స్కీమ్ల పని సామర్థ్యాన్ని మీరు పోల్చలేరు. ఒకే పెట్టుబడి లక్ష్యం, అసెట్ కేటాయింపు మరియు ఒకటే బెంచ్మార్క్ ఇండెక్స్ ఉన్న ఒకే కేటగిరీ నుండి స్కీమ్లు పోల్చబడాలి. మీరు ఒక ఎస్వియు ని ఒక సెడాన్తో అసలు పోల్చలేరు, ఎందుకంటే రెండు కార్లు విభిన్న అవసరాలకు అనుకూలంగా డిజైన్ చేయబడ్డాయి, అలాగే విభిన్న పెట్టుబడి లక్ష్యాల కోసం డిజైన్ చేయబడిన స్కీమ్లకు విభిన్న రిస్క్ స్థాయిలు ఉండవచ్చు. కానీ ఒకే బెంచ్మార్క్ అనుసరిస్తూ మీరు రెండు స్కీమ్లను పోల్చినప్పుడు, అప్పుడు అది ఒకే ఇంజన్ సిస్టమ్తో డిజైన్ చేయబడిన రెండు కార్ల పని సామర్థ్యాన్ని పోల్చినట్లు అవుతుంది.  రెండు బ్లూఛిప్ ఫండ్స్ లేదా రెండు స్మాల్ క్యాప్ పండ్స్ను పోల్చడం సరియైనదే, కానీ ఒక బ్లూచిప్ ఫండ్ను స్మాల్ క్యాప్ ఫండ్తో మీరు పోల్చకూడదు, అవి రెండూ ఈక్విటి పండ్స్ అయినప్పటికీ. అంతేకాకుండా, ఒకే కేటగిరీ లోపల, ఒకే సమయ వ్యవధిలో పని సామర్థ్యాన్ని పోల్చాలి, మీరు నగరంలో నడుస్తున్న కారు మైలేజిని హైవేలో నడుస్తున్న కారు మైలేజితో ఎలా పోల్చకూడదో సరిగ్గా అలాగే.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను