గోల్డ్ ETFలు మరియు గోల్డ్ ఫండ్‌ల వలన ప్రయోజనాలు

గోల్డ్  ETFలు మరియు గోల్డ్ ఫండ్‌ల వలన ప్రయోజనాలు zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

గోల్డ్ ETFలు 99.5% స్వచ్ఛత కలిగిన గోల్డ్ బులియన్‌లో పెట్టుబడి పెడతాయి, ఇది భౌతిక లోహం మీద పెట్టుబడి పెట్టినంత మంచిది.  మీరు దీర్ఘకాలానికి బంగారాన్ని కూడబెట్టాలని చూస్తున్నట్లయితే, దానిని భౌతిక రూపంలో ఉంచుకోవడం లేదా గోల్డ్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం కన్నా గోల్డ్  ETFలలో పెట్టుబడి పెట్టడం  తెలివైన ఎంపిక. 

గోల్డ్ మ్యూచువల్ ఫండ్‌లు బంగారాన్ని మైనింగ్, ప్రాసెస్ చేయడం, ఫ్యాబ్రికేషన్ చేయడం మరియు పంపిణీ చేయడం చేసే కంపెనీల స్టాకులలో పెట్టుబడి పెడతాయి.  గోల్డ్ ఫండ్ల పనితీరు ఈ కంపెనీలకు చెందిన స్టాక్ ధరల కదలికల మీద ఆధారపడి ఉంటుంది.  గోల్డ్  ETFలు లోహపు పనితీరుకు రాబడులను నేరుగా అనుసంధానమైతే, గోల్డ్ ఫండ్‌లు బంగారం పరిశ్రమ పనితీరుకు రాబడులను అనుసంధానం చేస్తాయి. 

ఫండ్ మేనేజర్లు నిర్వహించే గోల్డ్ మ్యూచువల్‌ ఫండ్స్ సక్రియంగా నిర్వహించబడతాయి కాబట్టి, మార్కెట్ ఇండెక్స్‌ను అనుకరించే గోల్డ్ ETF లతో పోల్చినప్పడు ఎక్కువ రాబడి అందించే సామర్థ్యం కలిగి ఉంటాయి. ETF లు ఇండెక్స్‌ను అనుకరిస్తాయి కాబట్టి, గోల్డ్ ETF లకు గోల్డ్ ఫండ్‌ల కంటే తక్కువ వ్యయ నిష్పత్తి ఉంటుంది. గోల్డ్  ETFలు గోల్డ్ మ్యూచువల్ ఫండ్‌ల కన్నా అత్యంత ఖచ్చితంగా భౌతిక లోహపు ధర మార్పులను ట్రాక్ చేస్తాయి. ETFలు ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ చేయబడతాయి కనుక, అవి అత్యధిక ఆర్డర్ లిక్విడిటీని అందిస్తాయి.  బంగారం వాస్తవ సమయ ధర వద్ద రోజులో ఏ సమయంలోనైనా మీ హోల్డింగులను మీరు కొనవచ్చు లేదా అమ్మవచ్చు. కాబట్టి గోల్డ్ ETFలు భౌతికంగా బంగారాన్ని కలిగి ఉండడానికి చక్కటి ప్రత్యామ్నాయం. గోల్డ్ పరిశ్రమలో SIP ద్వారా దీర్ఘకాల పెట్టుబడి పెట్టడానికి గోల్డ్ ఫండ్‌లు మంచి అవకాశం ఇస్తాయి. 

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను