మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడంలో లాభాలు ఏమిటి?

Video

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మనలో చాలా మంది మన స్వంత పెట్టుబడులను నిర్వహించడం గురించి భయపడతాము. ప్రొఫెషనల్ ఫండ్ మేనేజిమెంట్‌లో, వ్యక్తులు వారి విద్య, అనుభవం మరియు నైపుణ్యాలను బట్టి విభిన్న పనులకు బాధ్యులుగా ఉంచబడ్డారు.

ఒక ఇన్‌వెస్టర్‌గా, మీరు మీ ఆర్థిక విషయాలను మీకు మీరే నిర్వహించవచ్చు లేదా ఒక ప్రొఫెషనల్ సంస్థని నియమించుకోవచ్చు. మీరు తరువాతి దానిని ఎంచుకోవచ్చు:

  1. పనిని ఉత్తమంగా ఎలా చేయాలో మీకు తెలియదు- మనలో చాలా మంది మన ఇన్‌కం టాక్స్ రిటర్నులను నింపడానికి ఎవరో ఒకరిని నియమించుకుంటాము లేదా దాదాపు మనలో అందరు మన ఇంటిని నిర్మించడానికి ఒక ఆర్కిటెక్ట్‌ని తీసుకుంటాము.
  2. మీకు తగినంత సమయం లేదా వీలు లేనప్పుడు. ఇది మనకి డ్రైవింగ్ తెలిసినప్పటికీ డ్రైవర్లను నియమించుకున్నట్లు ఉంది.
  3. మీకు మీరే చేయడానికి బదులు మీరు డబ్బుని నియమించుకోవడం ద్వారా ఆదా చేయాలనుకోవడం. మీ స్వంత వాహనం డ్రైవ్ చేస్తూ ప్రయాణించడం రైలు ప్రయాణం కన్నా చాలా ఖరీదైనది.
  4. మీరు మీ సమయాన్ని మీ ఎంపిక/ ఇష్టం ప్రకారం ఇతర కార్యకలాపాల కొరకు వెచ్చించవచ్చు

ప్రొఫెషనల్ ఫండ్ మేనేజిమెంట్ మ్యూచువల్‌ ఫండ్స్ యొక్క ఉత్తమమైన ప్రయోజనాలలో ఒకటి. ఎడమ వైపున ఉన్న ఇన్‌ఫోగ్రాఫిక్ మిగిలిన ఇతరములను ప్రత్యేకంగా తెలుపుతుంది. ఈ ప్రయోజనాలు ఇవ్వబడినప్పుడు, ఒకరు ఏదైనా ఇతర పెట్టుబడి అవెన్యూ కొరకు చూడటానికి కారణం లేదు.

407
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను