ETF లలో పెట్టుబడి చేయడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ETF లలో   పెట్టుబడి చేయడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు (ETFలు) రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ కన్నా కూడా పలు ప్రయోజనాలను అందిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పోగొట్టుకుంటామని చింతించే మొదటిసారి పెట్టుబడి చేస్తున్న ఈక్విటీ పెట్టుబడిదారుల కొరకు అవి ఉత్తమ పెట్టుబడి  సాధనం. ఎందుకో చూద్దాం

• ETFలు ప్రసిద్ధ సూచికను అనుకరిస్తాయి, సూచికలో ఉంచిన అన్నీ సెక్యూరిటీలను కలిగి ఉండి, మ్యూచువల్ ఫండ్స్ కన్నా కూడా గొప్ప వైవిధ్యతను అందిస్తాయి

• వారి బెంచ్‌మార్క్ కన్నా అధిక రాబడిని చూపేందుకు వారి పోర్ట్‌ఫోలియో నుండి తరచుగా సెక్యూరిటీలను కొనే లేదా అమ్మేటువంటి, క్రియాశీలంగా నిర్వహించబడే ఫండ్ల కన్నా అనుకరణ వ్యూహం (నిష్క్రియాత్మకంగా ఫండ్ నిర్వహణ) ఫలితంగా కొద్ది మొత్తంలోనే లావాదేవీలు జరుగుతాయి. క్రియాశీలంగా నిర్వహించబడే మ్యూచువల్ ఫండ్లలో ఈ మథనం ఫలితంగా అధిక పన్ను భారం పడుతుంది ఎందుకంటే తమ పోర్ట్‌ఫోలియో పరిథిలో సెక్యూరిటీలను కొనేటప్పుడు లేదా అమ్మేటప్పుడు, ఫండ్లు STT(సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ పన్ను)ను, క్యాపిటల్ గెయిన్స్ పన్నును చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి ఇతర మ్యూచువల్ ఫండ్ల కన్నా ETFలు మరింత పన్ను దక్షత కలవి.

• క్రియాశీల రాబడులు అనగా వారి బెంచ్‌మార్క్ సూచీ కన్నా అధిక రాబడులను సృష్టించేందుకు అత్యధిక నైపుణ్యం కలిగిన ఫండ్ మేనేజర్లను తప్పకుండా నియమించుకోవలసి ఉండే, క్రియాశీలంగా నిర్వహించబడుతున్న మ్యూచువల్ ఫండ్లతో పోలిస్తే ETFలలో ఖర్చులు కూడా స్వల్పంగా ఉంటాయి. 

• పెట్టుబడిదారులకు ETFలు మరింత సౌకర్యాన్ని మరియు ద్రవ్యత్వాన్ని అందిస్తాయి ఎందుకంటే అవి ఎక్స్ఛేంజీలలో మరియు ట్రేడ్ వంటి స్టాక్‌ల మీద జాబితా చేయబడతాయి. క్రియాశీలంగా నిర్వహించబడుతున్న మ్యూచువల్ ఫండ్లలో రోజుకు ఒకసారి మాత్రమే అది కూడా మార్కెట్ ముగిసిన తరువాత NAV  లెక్కించబడుతుంది, అయితే ETF ఫండ్లలో మార్కెట్ సమయాల్లో ఏ సమయంలోనైనా వాస్తవ ధరల వద్ద పెట్టుబడిదారులు లావాదేవీ జరపవచ్చు. ఈక్విటీ ఇన్వెస్టింగ్ గురించి మీకు ఖచ్చితంగా తెలియకపోతే, ETFలతో మీరు మొదలుపెట్టవచ్చు.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను