మీరు ఎస్ఐపి చెల్లింపులు మధ్యలో తప్పితే ఏమవుతుంది?

Video

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

చాలా మంది ఇన్వెస్టర్లు దాని కాల పరిమితిలో ఎస్ఐపి చెల్లింపులు చేయలేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో నష్టాల గురించి ఆందోళన చెందుతారు. మీరు ఆర్ధిక కష్టాలలో ఉన్నా లేదా జాబ్ లేదా వ్యాపార ఆదాయంలో అనిశ్చితి ఉన్నా అట్టి పరిస్థితులు తలెత్తుతాయి. అట్టి పరిస్థితులలో మీ రెగ్యులర్ ఎస్ఐపి చెల్లింపులను కొనసాగించలేకపోవడం సహజమే. ఎస్ఐపిలు దీర్ఘ కాల ఇన్వెస్ట్మెంట్ ఎంపిక కావున, మీరు మధ్యలో కొన్ని చెల్లింపులు తప్పడం ఫర్వాలేదు. భీమా పాలసీలాగా కాకుండా చెలించకపోతే వార్షిక ప్రీమియం పాలసీ ఇన్యాక్టివేషన్కు దారితీయకుండా, ఇక్కడ అంత వరకు మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ రిటర్నుని ఆర్జించడం కొనసాగిస్తుంది మరియు మీరు ఏ సమయంలోనైనా విత్డ్రా చేసుకోవచ్చు. అయితే, మీరు ప్రారంభంలో ఆశించినదాని కన్నా తక్కువ సంపదను పోగుచేయవచ్చు మరియు మీరు మీ ఎస్ఐపితో కూడా రెగ్యులర్గా లేకపోతే మీ ఆర్థిక లక్ష్యాలను తప్పవచ్చు.

మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఎస్ఐపి వాయిదాలు చెల్లించనందుకు పెనాల్టీ విధించవు, వరుసగా మూడు నెలలు మీరు చెల్లింపులు చేయకపోతే మీ ఎస్ఐపి ఆటోమేటిక్గా రద్దు కావచ్చు. ఇంకా ఆటోడెబిట్ చెల్లింపులను డిజానర్ అయినందుకు బ్యాంకు మీకు పెనాల్టీ విధించవచ్చు. కావున, భవిష్యత్తులో డబ్బు అవసరాలను ముందస్తుగా ఊహించితే కనీసం 30 రోజులు ముందుగా అభ్యర్థనని పంపడం ద్వారా ఎస్ఐపిని ఆపమని సూచించవచ్చు. మీకు ఆర్థికంగా సౌకర్యవంతం అయినప్పుడు తరువాత మీరు తాజా ఎస్ఐపిని ప్రారంభించవచ్చు.

 

407
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను