రిస్క్-ఓ-మీటర్ అంటే ఏమిటి, మరియు దాని వివిధ స్థాయిలు ఏమిటి?

రిస్క్-ఓ-మీటర్ అంటే ఏమిటి, మరియు దాని వివిధ స్థాయిలు ఏమిటి?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

రిస్క్-ఓ-మీటర్ అనేది మ్యూచువల్ ఫండ్స్ కోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ప్రవేశపెట్టిన ప్రామాణిక రిస్క్ మెజర్మెంట్ స్కేల్. అన్ని మ్యూచువల్ ఫండ్ స్కీమ్ డాక్యుమెంట్లు రిస్క్-ఓ-మీటర్ؚను ముందుగా మరియు స్పష్టంగా ప్రదర్శించాలి, తద్వారా పెట్టుబడిదారులు ఆ నిర్దిష్ట ఫండ్ؚలో ఉన్న రిస్క్ గురించి తెలుసుకోగలరు.

రిస్క్-ఓ-మీటర్ రిస్క్‌ను ఆరు విభిన్న స్థాయిలుగా వర్గీకరిస్తుంది. అవి తక్కువ, తక్కువ నుండి మధ్యస్థం, మధ్యస్థం, మధ్యస్థం కంటే ఎక్కువ, ఎక్కువ మరియు చాలా అత్యధికం. ఎడమ వైపున అందించిన దృష్టాంతాన్ని చూడండి.

తక్కువ రిస్క్: ఈ కేటగిరీ క్రింద వచ్చే ఫండ్‌లు వాటి అంతర్లీన సెక్యూరిటీల కారణంగా తక్కువ రిస్క్ؚను కలిగి ఉంటాయి, ఇవి మూలధన రక్షణ కోరుకునే వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటాయి.

తక్కువ నుండి మధ్యస్థ రిస్క్: మధ్యస్థం నుండి దీర్ఘకాలంలో కొంత రాబడిని పొందడానికి కొంత మేరకు రిస్క్ తీసుకోవాలనుకునే పెట్టుబడిదారులకు ఇవి ఉపయోగపడతాయి. అతి తక్కువ కాలపరిమితి కలిగిన అనేక ఫండ్స్ ఈ వర్గంలో వస్తాయి.

మధ్యస్థ రిస్క్: కొంత రిస్క్ తీసుకొని తమ పోర్ట్ؚఫోలియోను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్న పెట్టుబడిదారులకు ఇది అనువైనది. అనేక డైనమిక్ బాండ్ ఫండ్స్ ఈ వర్గంలో వస్తాయి.

మధ్యస్థంగా అధిక రిస్క్: ఈ ఫండ్‌లు అధిక స్థాయి రిస్క్ కలిగి ఉంటాయి మరియు ఎక్కువ రిస్క్ ప్రొఫైల్ ఉన్న పెట్టుబడిదారులకు సరిపోతాయి. అధిక వృద్ధి లేదా లాభదాయకతను సాధించే అవకాశాలకు బదులుగా కొంత అనిశ్చితి మరియు అధిక అస్థిరతను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్న పెట్టుబడిదారులకు ఇవి తగినవి.

అధిక రిస్క్: ఈ కేటగిరీలో ఫండ్స్ ప్రధానంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. భవిష్యత్తులో లాభాలను పొందడం కోసం అధిక రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడేవారికి ఇవి అనువైనవి.

అత్యధిక రిస్క్: ఇవి అస్థిర స్టాక్‌లు లేదా విదేశీ మ్యూచువల్ ఫండ్ యూనిట్లలో పెట్టుబడి పెట్టే అత్యంత రిస్క్‌తో కూడిన ఫండ్‌లు. అధిక-రిస్క్, ఎక్కువ లాభదాయకమైన పెట్టుబడి అవకాశాలలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడే పెట్టుబడిదారుల కోసం తగినవి.

డిస్క్లైమర్

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.

పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను