మార్కెట్ ఒడిదుడుకులలో ఉన్నప్పుడు ఎందుకు SIP ద్వారా పెట్టుబడి పెట్టడం కొనసాగించాలి?

Video

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మార్కెట్లు ఒడిదుడుకులకు లోనైనప్పుడు అనేకమంది పెట్టుబడిదారులు తమ పెట్టుబడి నిర్ణయాలను సందేహించడం మొదలు పెడతారు మరియు తమ SIPలను ఆపివేయాలని లేదా తమ పెట్టుబడులను ఉపసంహరించాలని అనుకుంటారు. ఒడిదుడుకులతో కూడిన మార్కెట్ సమయంలో మీ పెట్టుబడులు ఎరుపుగా మారడం చూసినప్పుడు మీకు ఆందోళన కలగడం సహజమే. కానీ మీ SIPలను కొనసాగించడం తెలివైన పని, మరీ ముఖ్యంగా మార్కెట్ పడిపోతున్నప్పుడు, ఎందుకంటే అదే మొత్తం నెలవారీ పెట్టుబడితో మీరు ఎక్కువ యూనిట్లు కొంటారు. ఆన్లైన్ సేల్ లేదా కూరగాయల షాపులో కొనేటప్పుడు మనకందరికీ బేరం చేసి కొనడం ఇష్టం. కదా? అలాంటప్పుడు ధరలు పడిపోయేటప్పుడు మన మ్యూచువల్ ఫండ్ల్లో పెట్టుబడులలో ఇది ఎందుకు వద్దు?

మన వాతావరణ సూచన యాప్స్ కంటే మార్కెట్లు చాలా ఎక్కువ ఊహకు అందకుండా ఉంటాయి. మార్కెట్ పడిపోతున్నప్పుడు ఏక మొత్తంలో ఎప్పుడు పెట్టుబడి పెట్టాలో మీరు ఎప్పుడూ ఖచ్చితంగా నిర్ణయించలేరు. మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత ఒకవేళ మార్కెట్ ఇంకా పడిపోతే ఏమి చేస్తారు? అదేవిధంగా, మార్కెట్ పెరిగినప్పుడు ఎప్పుడు అమ్మాలో మీరు ఖచ్చితంగా నిర్ణయించలేరు, ఎందుకంటే మీరు అమ్మిన తర్వాత మార్కెట్ ఇంకా పెరగవచ్చు. మీరు మార్కెట్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తే మీరు పూర్తిగా నిరాశకు లోనవుతారు మరియు తప్పుడు సమయంలో తీసుకున్న నిర్ణయం వల్ల మీ రాబడులు ప్రభావితం కాగలవు. కాబట్టి, మీ లక్ష్యాలపై స్పష్టమైన దృష్టితో మార్కెట్ ఒడిదుడుకులలో కూడా SIP ద్వారా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం మంచిది. మీరు మార్కెట్ ఒడిదుడుకుల గురించి ఆందోళన చెందనవసరం లేదు, ఎందుకంటే మీ పెట్టుబడులు కొంత వ్యవధి తర్వాత సరాసరి అవుతాయి. 

402
481
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను