స్త్రీలకు ఆర్థిక స్వాతంత్రం ఎందుకు ముఖ్యం?

స్త్రీలకు ఆర్థిక స్వాతంత్రం ఎందుకు ముఖ్యం?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

గత రెండు దశాబ్దాలలో ఆర్థిక స్వాతంత్రం గురించి, మరీ ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి, ఎంతో రాయడం మరియు మాట్లాడటం జరిగింది. అయితే స్త్రీలకు ఆర్థిక స్వాతంత్రం అంటే అర్థం ఏమిటి? ఇది వ్యక్తిగతం మరియు దీని అర్థం వివిధ స్త్రీలకు విభిన్నమైనదిగా ఉంటుంది. ఒక ఉద్యోగం చేసే స్త్రీకి, దీని అర్థం తన సొంత ఆర్థిక నిర్ణయాలు తీసుకోగలగడం కావచ్చు లేదా ఆమెను ఆమె ఆర్థికంగా నిలబెట్టుకోగలగడం కావచ్చు. ఒక గృహిణికి, దీని అర్థం తనకు ఇష్టం వచ్చినప్పుడల్లా డబ్బు ఖర్చుపెట్టగలగడం కావచ్చు లేదా అత్యవసర పరిస్థితులలో ఆమెను ఆమె ఆర్థికంగా నిలబెట్టుకోగలగడం కావచ్చు.  

ప్రాధమిక స్థాయిలో, ఆర్థిక స్వాతంత్రం స్త్రీలు మరింత సురక్షితంగా మరియు వారి సామాజిక-ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా గౌరవించబడినట్లుగా భావించే చెందేలా చేస్తుంది. దీని ఆధారభూత ప్రభావం కేవలం స్త్రీల మీద మాత్రమే కాకుండా వారి కుటుంబాలు, సమాజం మరియు మొత్తంగా మీద దేశం మీద ఉంటుంది. మరింత ఆర్థికంగా స్వాతంత్రంగల స్త్రీలు అంటే  మరింత ఆరోగ్యవంతమైన, సురక్షితమైన మరియు తక్కువ పక్షపాతంగల మరింత ప్రగతిశీల సమాజం అని అర్థం. ఆర్థిక స్వాతంత్రంగల స్త్రీలు తమ పిల్లలకు రోల్ మోడల్స్ అవుతారు మరియు మన సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిన పాతకాలపు లింగ పక్షపాతాలను కూకటివేర్లతో పెకలించడానికి సహాయపడుతుంది. స్త్రీలు అప్పటివరకు అనుభవించిన కష్టాల తర్వాత తొందరగా విరామం పొంది జీవితంలోని ఆనందాన్ని అనుభవించడానికి కూడా ఆర్థిక స్వాతంత్రం సహాయపడుతుంది. 

స్త్రీల ఆర్థిక స్వాతంత్రానికి అంత ప్రాముఖ్యత ఉంటే, కుటుంబాలు, సమాజాలు మరియు ప్రభుత్వం ప్రయత్నించడానికి ముందే దాన్ని మొదట సాధించడానికి వారు తమకు తాము ఎలా సహాయపడగలరు? దీనికి సులభమైన సమాధానం స్త్రీల ఆర్థిక సంపదనా సామర్థ్యాలు మరియు విద్యా నేపథ్యాలతో సంబంధం లేకుండా క్రమశిక్షణగల పెట్టుబడిదారుగా మారటమే. ఎవరైనా తమ ఆర్థిక బలం మరియు విద్యా నేపథ్యం ఏమైనప్పటికీ, తమ సంపాదనలలో కొంత భాగం పొదుపు చేసి వివేకవంతంగా సరైన చోట క్రమశిక్షణతో కొంత కాలం పెట్టుబడి పెడితే తప్ప, వారు ఉద్యోగం కోల్పోవడం, వైద్య ఖర్చులు లేదా సంపాదించే కుటుంబ సభ్యుడుని కోల్పోవడం లాంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎప్పుడూ సరిగా సిద్ధమై ఉండలేరు.  

ఈనాడు, స్త్రీలో వివిధ పాత్రలలో పని చేస్తున్నారు, అయినప్పటికీ ఉద్యోగం చేసే స్త్రీలందరూ ఆర్థికంగా స్వతంత్రులు కారు. ఇప్పటికీ ఎక్కువ మంది స్త్రీలు పెట్టుబడి పెట్టే విషయంలో ఇప్పటికీ తమ కుటుంబంలోని మగవారిపై ఆధారపడి ఉన్నారు. అంతేకాకుండా, వారు తగినంత పొదుపు కూడా చేస్తూ ఉండకపోవచ్చు లేదా ఒకవేళ పొదుపు చేస్తూ ఉంటే, వివేకంగా పొదుపు చేస్తూ ఉండకపోవచ్చు, అంటే అది ద్రవ్యోల్బణంతో ఏమాత్రం సరిపోలక పోవచ్చు. ఇక్కడే స్త్రీలు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా క్రమశిక్షణతో దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టే విధానంపై ఆధారపడటాన్ని నేర్చుకోవచ్చు. ఒక స్త్రీకి కొద్దిగా సంపాదన ఉన్నా లేదా అసలు సంపాదన లేకపోయినా, ఆమెను ఆర్థిక స్వాతంత్రానికి దగ్గరగా తీసుకెళ్లడంలో సహాయపడే నెలవారి SIP మొదలు పెట్టడానికి తన పొదుపులో రూ. 500 అంత తక్కువ మొత్తం అయినా పక్కన పెట్టవచ్చు. కాబట్టి మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం సులభం మరియు సాధించదగినది అని ప్రతి స్త్రీ అర్థం చేసుకునేలా చేయడం చాలా ముఖ్యం. 

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను