డెట్ ఫండ్స్ రిస్క్ లేనివా?

Video

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

డెట్ ఫండ్స్ స్టాక్స్లో పెట్టుబడి పెట్టవు కాబట్టి వాటిలో రిస్క్ ఉండదు అనుకోవడం పొరపాటు. ఈక్విటీ ఫండ్స్తో పోల్చితే డెట్ ఫండ్స్లో రిస్క్ తక్కువ అనేది నిజమే అయినప్పటికీ దాని అర్థం మీ డబ్బుకు ఎప్పుడూ ఏ నష్టం ఉండదని డెట్ ఫండ్స్ గ్యారెంటీ ఇస్తాయని కాదు. డెట్ ఫండ్స్ డెట్ మరియు మనీ మార్కెట్ సెక్యూరిటీలలో పెట్టుబడి పెడ్తాయి, వీటికి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ఈక్విటీ ఫండ్స్తో పోల్చినప్పుడు వేరే రిస్క్ కారకాలు ఉన్నాయి. 

డెట్ ఫండ్స్ వడ్డీ రేటు రిస్క్, క్రెడిట్ రిస్క్ మరియు లిక్విడిటీ రిస్క్కు గురౌతాయి, అవి మనకందరికీ తెలిసిన స్టాక్ మార్కెట్ రిస్క్ కంటే చాలా భిన్నమైనవి. రోజువారీగా ఈ రిస్క్ కారకాలు స్టాక్ మార్కెట్ రిస్క్ అంత పైకి కనిపించేవి కాకపోయినా, వాటిని పూర్తిగా ఉపేక్షించలేము.

వడ్డీ రేట్లలో మార్పుల వల్ల వడ్డీ రేటు రిస్క్ ఉత్పన్నం అవుతుంది, ఇది డెట్ ఫండ్ పెట్టుబడి పెట్టిన బాండ్ల ధరలను ప్రభావితం చేస్తుంది. డెట్ ఫండ్ బాండ్లలో పెట్టుబడి పెట్టిన ఏవైనా కంపెనీలలో ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు క్రెడిట్ రిస్క్ తలెత్తుతుంది, ఎందుకంటే ఇది బాండ్లు చెల్లించవలసిన వడ్డీ మరియు అసలు చెల్లింపును అనిశ్చితం చేస్తుంది.  తరచూ ట్రేడ్ కాని డెట్ సెక్యూరిటీల విషయంలో లిక్విడిటీ రిస్క్ తలెత్తుతుంది, దీంతో ప్రతికూల పరిస్థితులకు లోనై ఫండ్ ఈ సెక్యూరిటీలను నష్టానికి అమ్మవలసి రావచ్చు. కాబట్టి డెట్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం అనేది ఈక్విటీ ఫండ్స్తో పోల్చినప్పుడు తక్కువ రిస్క్ కలది కావచ్చు, కానీ పూర్తిగా రిస్క్ లేనిది కాదు.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను