బ్యాంకులు మ్యూచువల్‌ ఫండ్స్‌ని అందిస్తాయా?

బ్యాంకులు  మ్యూచువల్‌ ఫండ్స్‌ని అందిస్తాయా?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

బ్యాంకులు సేవింగ్స్ మరియు లోన్ల వ్యాపారంలో ఉండగా పెట్టుబడుల కొరకు మ్యూచువల్‌ ఫండ్స్ కుడా అందిస్తాయి. మీ డబ్బుని మీరు ఒక సేవింగ్స్ అకౌంట్‌లో వేసినప్పుడు లేదా ఫిక్డ్ డిపాజిట్ చేసినప్పుడు, మీరు సేవింగ్స్ చేస్తున్నారు కాగా మీ డబ్బుని మీరు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఉంచినప్పుడు, మీరు పెట్టబుడులు చేస్తున్నారు. బ్యాంకింగ్ మరియు మ్యూచువల్‌ ఫండ్స్ రెండూ పూర్తిగా విభిన్న వ్యాపారాలు, వీటికి ప్రత్యేకమైన డొమైన్ మరియు సంస్థాపరమైన నైపుణ్యం అవసరం అవుతుంది. బ్యాంకులు ఆర్‌బిఐ ద్వారా పాలించబడతాయి కాగా మ్యూచువల్‌ ఫండ్స్ ఎస్ఇబిఐ ద్వారా పాలించబడతాయి. కొన్ని కార్పొరేట్ బ్యాంకింగ్ మరియు మ్యూచువల్‌ ఫండ్స్‌లో వ్యాపారం చేయాలనుకుంటే, అది సంబంధిత రెగ్యులేటర్ల నుండి ప్రత్యేకమైన అనుమతులను తప్పక పొందాలి మరియు ఈ రెండు వ్యాపారాలు విభిన్న కంపెనీలుగా నడపాలి.

మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారం న్న బ్యాంకులు కూడా మీకు ఎదురవ్వవచ్చు. కానీ విధి నిర్వహణపరమైన లింకేజులు లేకుండా రెండూ విభిన్న కంపెనీలు మరియు బ్యాంకుకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది కావున రిటర్నులను హామీ ఇవ్వలేవు.

నేడు చాలా బ్యాంకులు మ్యూచువల్ ఫండ్స్ సహా చాలా ఆర్థిక ఉత్పత్తుల డిస్‌ట్రిబ్యూటరుగా పనిచేస్తున్నాయి. పంపిణీ కొరకు వారితో (బ్యాంకులు) ఒప్పందం చేసుకున్న మ్యూచువల్‌ ఫండ్స్‌కి సేల్స్ ఛానెళ్ళుగా అవి నిర్వహిస్తాయి. కావున, మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఎలా పెట్టుబడి పెట్టాలని మీరు అనుకుంటే మరియు ఒక బ్యాంకుని సంప్రదించాలనుకుంటే, మార్కెట్లో అందుబాటులో ఉండే అన్ని ఫండ్స్‌ని బ్యాంకు అమ్మదని గుర్తుంచుకోండి .

407
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను