త్రైమాసిక చెల్లింపులు చేసే ఫండ్స్ ఉన్నాయా?

త్రైమాసిక చెల్లింపులు చేసే ఫండ్స్ ఉన్నాయా?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మీ నెలవారీ ఇంటి ఖర్చులను నిర్వహించడానికి క్రమమైన ఆదాయం కొరకు మీరు చూస్తుంటే, మీరు మ్యూచువల్ ఫండ్‌లో సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్స్ (SWP) తీసుకోవాలి. మీరు చేయవలసినది ఒక పెద్ద ఏక మొత్తాన్ని అనువైన స్కీములో పెట్టబడి పెట్టి తరువాత ఒక ఎస్‌డబ్ల్యుపిని ఒక సంవత్సరం తరువాత ప్రారంభించడం, తద్వారా షార్ట్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను వర్తించదు. మీ అవసరాన్ని బట్టి మీరు చెల్లింపు మొత్తాన్ని మరియు అంతరాన్ని నిర్ణయించవచ్చు మరియు మీకు ఇష్టమైనప్పుడు వాటిని మార్చవచ్చు.

ఒక మ్యూచువల్ ఫండ్ స్కీములో డెవిడెండ్ కొరకు ఎంపిక చేయడం కన్నా ఎస్‌డబ్ల్యుపి మంచిది ఎందుకంటే డెవిడెండ్ చెల్లింపులకు హామీ ఉండదు. అవి మ్యూచువల్ ఫండ్స్‌లో మీ డబ్బుని పెట్టుబడి పెట్టిన కంపెనీలు చేసిన లాభాలకు లోబడి ఉంటాయి. మార్కెట్ తగ్గినా మరియు మీ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో నష్టాలు ఉన్నా, మీరు ఎటువంటి డివిడెండ్లను అందుకోకపోవచ్చు. ఎస్‌డబ్ల్యుపి విషయంలో, స్కీముకి నష్టాలు ఉన్నా, ఎంపిక చేసుకున్నమొత్తాన్ని, అసలును డిగ్గింగ్ చేస్తూ చెల్లిస్తుంది కావున, ఎస్‌డబ్ల్యుపి విషయంలో ప్రారంభించడానికి మీ వద్ద ఏక మొత్తం ఉండాలి. మీ ఏకమొత్తం పెట్టుబడిలో మీరు ఒక అనుపాతంగా ఒక విత్డ్రాయల్ మొత్తాన్ని ఏర్పరుచుకోవచ్చు అది ఫండ్ నుండి మీరు ఆశించిన రిటర్నుల కన్నా కొద్దిగా తక్కువగా ఉండేది, తద్వారా మీ అసలు దాదాపు అన్ని సమయాలలో చెక్కుచెదరకుండా ఉంటుంది.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను