Skip to main content

విలంబ ఖర్చు (కాస్ట్ ఆఫ్ డిలే) క్యాలిక్యులేటర్

మీరు ఆలస్యంగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? మీరు నిర్ణయం తీసుకునే ముందు, మీ రాబడిపై ఉండే ప్రభావాన్ని లెక్కించడాన్ని పరిగణించండి.

%
సంవత్సరాలు

ఆలస్యం వలన కలిగే నష్టం1.27 లక్షలు

పెట్టుబడి పెట్టిన మొత్తం సంవత్సరాలు

ఈ రోజే పెట్టుబడి పెట్టండి

10 సంవత్సరాలు

తరువాత పెట్టుబడి పెట్టండి

5 సంవత్సరాలు

పెట్టుబడి పెట్టిన మొత్తం విలువ

ఈ రోజే పెట్టుబడి పెట్టండి

1.20 లక్షలు

తరువాత పెట్టుబడి పెట్టండి

60,000

మీ పెట్టుబడి యొక్క తుది విలువ

ఈ రోజే పెట్టుబడి పెట్టండి

2.05 లక్షలు

తరువాత పెట్టుబడి పెట్టండి

77,437.07

సంపద సృష్టి

ఈ రోజే పెట్టుబడి పెట్టండి

84,844.98

తరువాత పెట్టుబడి పెట్టండి

17,437.07

పరిత్యాగ ప్రకటన

  1. గతంలో ప్రదర్శించిన పనితీరు భవిష్యత్తులో కొనసాగవచ్చు లేదా కొనసాగకపోవచ్చు మరియు ఇది భవిష్య రాబడులకు హామీ కాదు.
  2. ఈ క్యాలిక్యులేటర్లు కేవలం దృష్టాంత ప్రయోజనాలకు మాత్రమే కానీ అసలైన రాబడులను సూచించవు.
  3. మ్యూచువల్ ఫండ్‌లకు స్థిరమైన రాబడి రేటు ఉండదు అలాగే రాబడి రేటును అంచనా వేయడం సాధ్యపడదు. *ఇక్కడ చూపించిన విలువపై ద్రవ్యోల్బణం ప్రభావాన్ని ఇది పరిగణలోకి తీసుకోదు.
  4. దయచేసి గమనించండి, ఈ క్యాలిక్యులేటర్లు విశదీకరణ కొరకు మాత్రమే, వాస్తవ రాబడులను సూచించవు.
  5. మ్యూచువల్ ఫండ్స్ కి స్థిరమైన రాబడి రేటు అంటూ ఉండదు, అంతేకాకుండా రాబడి రేటును ముందుగానే ఊహించడం సాధ్యం కాదు.
  6. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.

ఇతర క్యాలిక్యులేటర్లు

goal sip calculator
లక్ష్య (గోల్) SIP క్యాలిక్యులేటర్

ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకునేందుకు మీరు చేయవలసిన నెలవారీ SIP పెట్టుబడులను నిర్ధారిస్తుంది.

ఇప్పుడే కాలిక్యులేట్ చేయండి
smart goal calculator
స్మార్ట్ గోల్ క్యాలిక్యులేటర్

మీ ప్రస్తుత పెట్టుబడిని పరిగణించి, అవసరమైన SIP లేదా ఏకమొత్తాన్ని లెక్కించడం ద్వారా మీ ఆర్ధిక లక్ష్యాన్ని రూపొందించుకోండి.

ఇప్పుడే కాలిక్యులేట్ చేయండి
inflation calculator
ఇన్‌ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం) క్యాలిక్యులేటర్

మీ నగదు మీద ఇన్‌ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం) యొక్క ప్రభావాన్ని లెక్కించండి. ఇన్‌ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం) దృష్ట్యా మీ ప్రస్తుత ఖర్చులను తీర్చుకునేందుకు భవిష్యత్తులో మీకు ఎంత నగదు అవసరమవుతుందో కనుక్కోండి.

ఇప్పుడే కాలిక్యులేట్ చేయండి
Retirement Planning Calculator
రిటైర్మెంట్ ప్లానింగ్ క్యాలిక్యులేటర్

మీ ఖర్చుల ఆధారంగా మీకు అవసరమైన రిటైర్మెంట్ నిధిని అంచనా వేయండి, దాన్ని సాధించడానికి అవసరమైన నెలవారీ పెట్టుబడిని కూడా గణించండి.

ఇప్పుడే కాలిక్యులేట్ చేయండి

క్యాలిక్యులేటర్లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు

finance-planning
సులభంగా ఆర్థిక ప్రణాళిక చేయవచ్చు
saves-time
సమయన్నీ ఆదా చేస్తుంది
easy-to-use
ఉపయోగించడం సులభం
helps-make-informed-decisions
అవగాహనతో కూడిన నిర్ణయాలను తీసుకోవడంలో సహాయపడుతుంది

విలంబ ఖర్చు (కాస్ట్ ఆఫ్ డిలే) అంటే ఏమిటి?

పెట్టుబడి పెట్టడాన్ని కొన్ని సంవత్సరాలు వాయిదా వేసినప్పుడు అవసరమైన నగదు మొత్తాన్ని విలంబ ఖర్చు (కాస్ట్ ఆఫ్ డిలే) సూచిస్తుంది.

విలంబ ఖర్చు (కాస్ట్ ఆఫ్ డిలే) క్యాలిక్యులేటర్ అంటే ఏమిటి?

మీ వ్యవస్థాగత పెట్టుబడులను ఒక నిర్దిష్ట వ్యవధి వరకు ఆలస్యం చేయడం వలన కలిగే పరిణామాలను అర్ధం చేసుకోవడానికి విలంబ ఖర్చు (కాస్ట్ ఆఫ్ డిలే) క్యాలిక్యులేటర్ మీకు సహాయపడుతుంది. మీరు మీ పెట్టుబడులను ఆలస్యం చేయడం వలన, మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన అదనపు నగదు మొత్తాన్ని తెలుసుకోవడంలో ఇది మీకు సహాయపడుతుంది.
మీరు చేసే కొద్దిపాటి ఆలస్యం కూడా మీ దీర్ఘ-కాలిక పెట్టుబడులపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది అని ఇది సూచిస్తుంది, కాబట్టి ఆర్ధికంగా విజయం సాదించడానికి వాటిని వెంటనే ప్రారంభించడం అవసరం.

ప్రజలు తమ పెట్టుబడులను ఆలస్యం చేయడానికి కారణమేమిటి?

పెట్టుబడులను పెట్టడాన్ని ఆలస్యం చేసే ప్రధాన కారణాలు ఈ క్రింది చూడవచ్చు:

  • తగిన ఆర్ధిక అవగాహన లేకపోవడం
  • స్పష్టమైన లక్ష్యాలు మరియు ప్రణాళికలు లేకపోవడం
  • వాయిదా వేయడం
  • సరైన విధంగా బడ్జెట్ చేయకపోవడం
  • భయంతో రిస్క్‌ను తీసుకోకపోవడం

పెట్టుబడులను ఆలస్యం చేయడం వలన గణనీయమైన పరిణామాలు ఉంటాయి:

  • మార్కెట్‌లో సమయాన్ని కోల్పోవడం వలన దీర్ఘ-కాలిక లక్ష్యాలకు తగినన్ని నిధులు లేకపోవడం
  • మీ డబ్బు యొక్క కొనుగోలు శక్తి బలహీనపడటం
  • కాంపౌండింగ్ శక్తిని కోల్పోవడం

విలంబ ఖర్చు (కాస్ట్ ఆఫ్ డిలే) క్యాలిక్యులేటర్‌ను మీరు ఎప్పుడు ఉపయోగించాలి?

పెట్టుబడిని వాయిదా వేయాలని భావిస్తున్నప్పుడు విలంబ ఖర్చు (కాస్ట్ ఆఫ్ డిలే) క్యాలిక్యులేటర్‌ను ఉపయోగాన్ని పరిగణించండి. జాప్యం కారణంగా అవసరమయ్యే పెట్టుబడి మొత్తాలలో తేడాలను అంచనా వేయడంలో ఇది సహాయపడుతుంది, తద్వారా తక్షణ, ఆలస్య ఎంపికలను పోల్చి చూడవచ్చు మరియు అసలైన సంఖ్యల ఆధారంగా మెరుగైన నిర్ణయాలను తీసుకోవచ్చు.

విలంబ ఖర్చు (కాస్ట్ ఆఫ్ డిలే) క్యాలిక్యులేటర్ ఉపయోగించడం వలన కలిగే ప్రయోజనాలు

  • సమయ-ఆధారిత అవకాశాలను పరిశీలించవచ్చు: కాల-పరిమితి కలిగిన పెట్టుబడి ఎంపికల విషయంలో తక్షణమే స్పందించడం లేదా ఆలస్యం చేయడం, ఏది ఆర్ధికంగా ప్రయోజనకరమో నిర్ధారించవచ్చు.
  • దీర్ఘ కాలిక వృద్ధిని విశ్లేషించవచ్చు: క్రమమైన పెట్టుబడులను వాయిదా వేయడం వలన అభివృద్ధిలో కలిగే సంభావ్య నష్టాన్ని మరియు కాంపౌండింగ్ ప్రభావాలను చూడవచ్చు.
  • పెట్టుబడి ఎంపికలను పోల్చవచ్చు: విభిన్న కాల పరిమితులు లేదా సంభావ్య రాబడులతో అనేక ఎంపికలలో పెట్టుబడులను జాప్యం చేయడం వలన కలిగే నష్టాలను లెక్కించవచ్చు మరియు పోల్చవచ్చు.

విలంబ ఖర్చు (కాస్ట్ ఆఫ్ డిలే) క్యాలిక్యులేటర్ ఎలా పని చేస్తుంది?

ఈ క్యాలిక్యులేటర్ మార్కెట్ హెచ్చుతగ్గులు లేదా రాబడులపై బాహ్య ప్రభావాలను పరిగణనలోకి తీసుకోకుండా, ముందుగా నిర్వచించిన సూత్రం ఆధారంగా పనిచేస్తుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు

పెట్టుబడులను వాయిదా వేయడం వలన కలిగే ప్రభావాన్ని చూపడం ద్వారా అవగాహనాపూర్వక నిర్ణయాలను తీసుకోవడంలో పెట్టుబడి జాప్యం క్యాలిక్యులేటర్ సహాయపడుతుంది. పెట్టుబడులను ప్రారంభించడం మరియు మీ ఆర్ధిక లక్ష్యాల కోసం కృషి చేయడానికి సరైన సమయాన్ని నిర్ధారించడంలో ఇది మీకు సహాయపడుతుంది.