నేను నా డబ్బుని అన్ని రోజులలో తీసుకోగలనా లేదా నిర్దిష్ట రోజులలో మాత్రమేనా?

నేను నా డబ్బుని అన్ని రోజులలో తీసుకోగలనా లేదా నిర్దిష్ట రోజులలో మాత్రమేనా?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

ఓపెన్ ఎండ్ ఫండ్ అన్ని వ్యాపార దినాలలో రిడెంషన్స్‌కి అనుమతినిస్తుంది. ఇన్ వెస్టర్ సర్వీస్ సెంటర్ లో వ్యాపారేతర రోజునాడు రిడెంషన్ అభ్యర్థన లేదా నిర్దిష్ట కట్-ఆఫ్ సమయం మధ్యానం 3:00 అనుకుందాము తరువాత సమర్పించితే, అప్పుడు అది తరువాత వ్యాపార పని దినం నాడు ప్రాసెస్ చేయబడుతుంది. రిడెంషన్లు నిర్దిష్ట రోజు నికర ఆస్తి విలువ (ఎన్‌ఎవి) వద్ద ప్రాసెస్ చేయబడతాయి. అన్ని రిడెంషన్ ప్రొసీడ్లు ఇన్‌వెస్టర్ బ్యాంకు అకౌంటుకి నిర్దిష్ట కాలంలో, సాధారణంగా 10 వ్యాపార పని దినాలలో క్రెడిట్ చేయబడుతుంది.

రిడెంషన్‌లు స్కీము యొక్క ఫోలియో నంబర్‌ని స్పష్టంగా తెలపడం ద్వారా ఒక సైన్డ్ రిడెంషన్ రిక్వెస్ట్ అందించి చేయవచ్చు. రిడెంషన్లు ఆమోదించబడిన ఆన్-లైన్ ప్లాట్ ఫారంల పైన కూడా చేయవచ్చు, అందులో ఇన్వెస్టర్‌లకు తప్పనిసరి సెక్యూరిటీ కోడ్‌లు ఉంటాయి.

ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ఇఎల్ఎస్ఎస్)లో చేసిన ఇన్‌వెస్ట్‌మెంట్లకు అయితే, 3 సంవత్సరాల లాక్-ఇన్ ఉంటుంది, ఆ తరువాత వాటిని ఏదై పని దినంలో రిడీం చేసుకోవచ్చు.

అసాధారణ పరిస్థితులలో మాత్రమే రిడెంషన్లు పరిమితం చేయబడతాయి. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల నుండి ఆమోదం క్రింద, లిక్విడిటీ సమస్య, క్యాపిటల్ మార్కెట్ మూసివేత, నిర్వహణా సంక్షోభం లేదా ఎస్ఇబిఐ ద్వారా నిర్దేశించబడినప్పుడు ఎఎమ్‌సి పరిమితులను విధించవచ్చు. ఇటువంటిది సంభవించడం మిక్కిలి అరుదు అని గమనించడం ముఖ్యము.

405
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను