ఒక మ్యూచువల్ ఫండ్ స్కీము ఉపయోగించి ఎవరైనా బహుళ అసెట్ విభాగాలలో పెట్టుబడి పెట్టవచ్చా?

ఒక మ్యూచువల్ ఫండ్ స్కీము ఉపయోగించి ఎవరైనా బహుళ అసెట్ విభాగాలలో పెట్టుబడి పెట్టవచ్చా?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

సింగిల్ అసెట్ విభాగంలో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్ స్కీములు స్పెషలిస్ట్ బౌలర్లు లేదా బ్యాట్స్మెన్ లాంటివి. కాగా హైబ్రిడ్ ఫండ్స్ అనే కొన్ని ఇతర స్కీములు, ఒక అసెట్ వర్గం కన్నా ఎక్కువగా పెట్టుబడి పెడతాయి, ఉదా. కొన్ని ఈక్విటీలో మరియు డెబిట్ రెండింటిలో ఇన్వెస్ట్ చేస్తాయి. కొన్ని ఈక్విటీ మరియు డెబిట్ కాకుండా గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేస్తాయి.

క్రికెట్లో మనం బ్యాటింగ్ ఆల్ రౌండర్లను మరియు బౌలింగ్ ఆల్ రౌండర్లను వారికి బాగా ఉన్న నైపుణ్యాన్నిబట్టి మనం చూస్తాము. అదేవిధంగా, కొన్ని మ్యుచవల్ ఫండ్స్ ఇంకొక దానితో పోల్చినప్పుడు ఒక అసెట్ వర్గంలో భారీగా ఇన్వెస్ట్ చేస్తాయి.

అతి పూరాతన వర్గం, బ్యాలెన్స్డ్ ఫండ్ వర్గం, ఈక్విటీ మరియు డెబిట్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. సాధారణంగా ఈక్విటీకి కేటాయింపు ఎక్కువగా (65% మించి) ఉంటుంది మిగిలినది డెబిట్కు ఉంటుంది.

ఇతర ప్రాచుర్యం పొందిన వర్గం ఎమ్ఐపి అని అంటారు ఇన్వెస్టర్లకు నెలవారీ ఆదాయాన్ని(లేదా రెగ్యులర్‌గా) అందిచేందుకు ఉన్నాయి. అయితే, రెగ్యులర్ ఆదాయానికి హామీ లేదు. ఈ స్కీములు డెబిట్ సెక్యూరిటీలలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తాయి కావున రెగ్యులర్ ఆదాయం రాగలదు. సంవత్సరాలలో రిటర్నులు పెంచడానికి ఒక చిన్న భాగం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయబడుతుంది. 

ఒక పోర్ట్‌ఫోలియోలో మూడు విభిన్న అసెట్ వర్గాల లాభాన్ని పొందడానికి హైబ్రిడ్ స్కీములో ఇంకొక వేరియేషన్ ఈక్విటీ, డెబిట్ మరియు గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది.

ఇన్వెస్టర్‌కు విభిన్న ఈక్విటీ లేదా డెబిట్ లేదా గోల్డ్ ఫండ్ స్కీములలో కొనుగోలు చేసే ఎంపిక ఉంటుంది. లేదా ఒక హైబ్రిడ్ ఫండ్ ని కొనవచ్చు.

420
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను