పెట్టుబడి పెట్టడంలో జాప్యం ఖరీదు

పెట్టుబడి పెట్టడంలో జాప్యం ఖరీదు zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

ఉదాహరణకు శీతాకాలంలో మీ దగ్గర ఉన్న ఎయిర్ కండిషనర్(AC) సరిగ్గా పనిచేయడం లేదని అనుకుందాం. ప్రస్తుతానికి అవసరం లేదని, దాన్ని బాగు చేయించడం వాయిదా వేశారు అనుకోండి. వేసవికాలం వచ్చేటప్పటికి, వేడి తట్టుకోలేనంతగా ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ACని బాగు చేయించుకోవాలి. దురదృష్టవశాత్తు, ఆ సమయంలో డిమాండ్ అధికంగా ఉంటుంది కాబట్టి రిపేర్ చేయడానికి టెక్నిషియన్ దొరకడం కూడా సవాలుగా మారుతుంది. టెక్నీషియన్ దొరికినప్పటికీ, దాన్ని రిపేర్ చేయడానికి ఇంకో వారం పడుతుందని చెబుతారు, అంతే కాకుండా అవసరమైన మదర్‌బోర్డుకు డిమాండ్ అధికంగా ఉండటం వలన దాని ధర కూడా అధికంగా ఉంటుంది కాబట్టి మరింత ఖర్చు ఎక్కువ అవుతుంది.

కొన్ని నెలల పాటూ AC రిపేర్ ఆలస్యం చేయడం వలన, మీకు అవసరమైనప్పుడు, అది మీకు ఖరీదైన వ్యవహారంగా మారింది. 

పెట్టుబడుల జాప్యం ఖరీదు కూడా సరిగ్గా అలానే ఉంటుంది. మీ పెట్టుబడి ఆలస్యం కావడం వలన, మీ నగదు నుండి ఆదాయాన్ని జెనరేట్ చేసే మీ సామర్ధ్యం కూడా ఎంత గానో జాప్యం కావచ్చు. వ్యాపారాన్ని మొదలుపెట్టడం లేదా రిటైర్మెంట్ కోసం ఆదా చేయడం వంటి పెట్టుబడి లక్ష్యాలను చేరుకునే మీ సామర్ధ్యాన్ని అది దెబ్బతీయవచ్చు, తద్వారా అవకాశాలను కోల్పోవడం లేదా సంభావ్య లాభాలను కోల్పోవడం వంటివి జరగవచ్చు.

వాస్తవ మాటలలో పెట్టుబడుల జాప్యం ఖరీదు 

మీకు ఆర్థిక లక్ష్యం ఉన్నా, లేకున్నా మీరు మీ ఆదాలు మరియు పెట్టుబడుల దిశగా ధనాన్ని కూడబెట్టడం తక్షణమే ఆరంభించాలి. జాప్యం ఖరీదు గణనీయంగా ఉండవచ్చు. మీకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి తెలిస్తే, కాలం గడిచే కొద్దీ మీ పెట్టుబడులపై ఎక్కువ రాబడి వస్తుందని మీకు అర్ధమవుతుంది. దీన్ని ఒక ఉదాహరణతో చక్కగా అర్థం చేసుకుందాం. 

రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవడం అత్యంత కీలకం. దాని కోసం ఆదా చేయడం మీరు వీలైనంత త్వరగా ఆరంభించాల్సి ఉంటుంది. మీకు 27 సంవత్సరాలు, మీ రిటైర్మెంట్ గురించి ప్లాన్ చేయడానికి మీకు తగినంత సమయం ఉందని అనుకుంటున్నారు. నెలకు ₹5000 SIPతో 30 సంవత్సరాల వయస్సు నుండి పెట్టుబడి పెట్టడాన్ని మీరు ప్రారంభించాలనుకున్నారు. అయితే మీకు 30 సంవత్సరాలు వచ్చేసరికి కొత్త బాధ్యతలు మీద పడవచ్చు. మీకు వివాహం అయ్యింది అనుకుందాం. కాబట్టి, మీ రిటైర్మెంట్ ప్లానింగ్ మరి కొన్ని సంవత్సరాలకు మీరు వాయిదా వేశారు. 35 సంవత్సరాలకు, ఇప్పటికైనా మొదలుపెడదామని, ఒక మ్యూచువల్ ఫండ్లో నెలకు రూ.7500 పెట్టుబడి పెట్టడం ఆరంభించారు. ప్రతి సందర్భంలో మీ మూలధనం ఇలా ఉంటుంది: 

 

వివరాలు

25 సంవత్సరాల వద్ద ఆరంభిస్తే

30 సంవత్సరాల వద్ద ఆరంభిస్తే

35 సంవత్సరాల వద్ద ఆరంభిస్తే

రిటైర్మెంట్ సమయం (60 సంవత్సరాల వద్ద మీరు రిటైర్ అవుతారనుకుందాం) (ఎ)

35

30

25

నెల నెలా పెట్టుబడి పెట్టే అమౌంట్ (బి)

Rs 5,000

Rs 5,000

Rs 7,500

పెట్టుబడి మీద ఊహించిన రాబడి*

10%

10%

10%

పెట్టుబడి పెట్టిన అమౌంట్

Rs 21,00,000

Rs 18,00,000

Rs 22,50,000

రాబడులతో కలిపి సమకూరిన మొత్తం మూలధనం (రిస్కులకు లోబడి)

Rs 1,89,83,190

Rs 1,13,96,627

Rs 99,51,251

పెట్టుబడి పెట్టడంలో జాప్యం ఖరీదు

-

Rs 41,78,748

Rs 90,31,940

*పై క్యాలిక్యులేషన్లు విశదీకరణ ప్రయోజనాల కొరకు మాత్రమే. ఎ*బి*12 అనే సూత్రం ఆధారంగా పెట్టుబడి అమౌంటు లెక్కించబడింది. జాప్యం ఖరీదు క్యాలిక్యులేటర్ ఉపయోగించి, రాబడులతో సమకూర్చిన మొత్తం మూలధనం లెక్కించబడింది. 25 సంవత్సరాల నుండి నిర్మించుకున్న మూలధనం మొత్తం నుండి ఒక నిర్దిష్ట వయస్సు వద్ద సమకూర్చిన మొత్తం మూలధనాన్ని తీసివేసి, పెట్టుబడి జాప్యం ఖరీదును క్యాలిక్యులేట్ చేశారు.

ఇక్కడ చూస్తే, మీరు మీ నెలవారీ SIPని పెంచుకుంటూ పోయినప్పటికీ, పెట్టుబడి పెట్టడంలో జాప్యం ఖరీదు అధికంగా ఉంటుంది. 25 సంవత్సరాల SIPతో అంతిమ అమౌంటును ₹5000తో మ్యాచ్ చేసేందుకు, 35 సంవత్సరాల వద్ద మీరు ప్రారంభిస్తే, ప్రతి నెలా ₹14,300 మీరు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కొద్ది సంవత్సరాలు పెట్టుబడిని మీరు జాప్యం చేయడం వల్ల పెద్ద మొత్తంలో మూల్యం చెల్లించాల్సి వస్తుంది కదా? 

మీరు మీ పెట్టుబడి పెట్టడంలో జాప్యం చేస్తే ఎంత ధనాన్ని మీరు కోల్పోగలరో అన్నది జాప్యం ఖరీదు కాలిక్యులేటర్ ఉపయోగించి మీరు అంచనా వేయవచ్చు. 

పెట్టుబడి పెట్టడం త్వరగా ఆరంభించాలి ఎందుకు?

1.  సమయం మీకు అనుకూలంగా ఉంటుంది
త్వరగా పెట్టుబడి పెట్టడం వల్ల దీర్ఘకాల ప్రయోజనాన్ని పొందవచ్చు. ఎంత ఎక్కువకాలం పెట్టుబడులు పెడితే, అంత అధికంగా అవి రాబడులను సమకూరుస్తాయి. అంటే త్వరగా ఆరంభించే తక్కువ మొత్తంలో పెట్టుబడులు సైతం కాలక్రమేణా గణనీయమైన సంపదను అందించే సంభావ్యతను కలిగి ఉంటాయి.

2.  చక్రవడ్డీ
త్వరగా పెట్టుబడి పెట్టడం వలన పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ప్రయోజనాన్ని మీరు పొందుతారు. చక్రవడ్డీ అనేది మీ పెట్టుబడుల మీద వచ్చే రాబడులను మళ్ళీ పెట్టుబడి పెట్టి వాటి మీద రాబడులను జనరేట్ చేస్తుంది. కొంతకాలానికి, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వలన మీ పెట్టుబడులలో విశేషమైన వృద్ధి పొందుతారు. 

3.  మరిన్ని పెట్టుబడి వికల్పాలు
త్వరగా పెట్టుబడి పెట్టడం వలన వివిధ పెట్టుబడి వికల్పాలు మరియు వ్యూహాలను మీరు అన్వేషించగలరు. ఒక వికల్పం పని చేయకపోతే, మీరు మీ వ్యూహాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది.

4.  దీర్ఘకాల లక్ష్యాలను సాధించడం
త్వరగా పెట్టుబడి పెట్టడం వలన రిటైర్మెంట్, ఇల్లు కొనుగోలు చేయడం, లేదా పిల్లల చదువులకు డబ్బు సమకూర్చడం వంటి దీర్ఘకాల లక్ష్యాల దిశగా మీరు పని చేయగలుగుతారు. మీరు ఎంత త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, ఈ లక్ష్యాలను సాధించడానికి కావలసిన వనరులను నిర్మించుకునేందుకు అంత అధిక సమయం ఉంటుంది.

సారాంశం 
పెట్టుబడులు పెట్టడంలో జాప్యం ఖరీదు గణనీయంగా ఉండవచ్చు మరియు అది మీ దీర్ఘకాల ఆర్ధిక లక్ష్యాలను దెబ్బతీయవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో ఒక SIP ద్వారా కానీ లేదా ఒక పెద్ద మొత్తంలో గానీ మీరు పెట్టే పెట్టుబడి, మీ లక్ష్యాలను సాధించడానికి మీకు సహాయపడవచ్చు. ప్రొడక్ట్/స్కీం మీకు సరిపోతుందా లేదా అన్నది తెలుసుకునేందుకు ఒక మ్యూచువల్ ఫండ్ అనుభవజ్ఞుడిని మీరు సంప్రదించవచ్చు.


డిస్క్లైమర్
AMFI వెబ్‌సైట్‌లో మ్యూచువల్ ఫండ్‌ల వివిధ వర్గాల గురించి ప్రచురించిన సమాచారం, ఒక ఆర్ధిక సంబంధిత ఉత్పాదక వర్గంగా మ్యూచువల్ ఫండ్స్ గురించి అవగాహన ఏర్పరచేందుకు సమాచార సంబంధిత ప్రయోజనాల కోసం మాత్రమే కానీ విక్రయాల ప్రమోషన్ లేదా వ్యాపార అభ్యర్ధనల కోసం మాత్రం కాదు. 

బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గత మూలాలు, ఇతర విశ్వసనీయమైన తృతీయ వర్గపు మూలాల ఆధారంగా ఈ సమాచారం AMFI ద్వారా తయారుచేయబడింది. అయినప్పటికీ, అటువంటి సమాచార ఖచ్చితత్వానికి, దాని సంపూర్ణతకు AMFI ఎటువంటి హామీ ఇవ్వదు, లేదా అటువంటి సమాచారం మార్చబడదని వారంట్ ఇవ్వదు. 

ఇక్కడి సమాచారం, ప్రతి ఒక్క మదుపుదారుని ఉద్దేశ్యాలు, రిస్కు కాంక్షలు, లేదా ఆర్ధిక సంబంధిత అవసరాలు లేదా పరిస్థితులు లేదా ఇక్కడ విశదపరచిన మ్యూచువల్ ఫండ్ ఉత్పత్తుల పొందికలను పరిగణనలోకి తీసుకోదు. తద్వారా, దీనికి సంబంధించి పెట్టుబడి సలహా కొరకు తమ తమ ప్రొఫెషనల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్/కన్సల్టెంట్/ట్యాక్స్ అడ్వైజర్ లను మదుపరులు సంప్రదించవలసిందిగా సూచించడమైనది. 

ఒక మ్యూచువల్ ఫండ్ స్కీం అనేది ఒక డిపాజిట్ ఉత్పత్తి కాదు, మరియు అది మ్యూచువల్ ఫండ్ లేదా దాని AMCకి లోబడి ఉండదు, లేదా వారి చేత హామీగానీ, రక్షణను గానీ అందించబడదు. సంబంధిత పెట్టుబడుల స్వభావం కారణంగా, ఒక మ్యూచువల్ ఫండ్ ఉత్పత్తి రాబడులు లేదా సంభావ్య రాబడులు హామీ ఇవ్వబడవు. చూపించిన చారిత్రక పనితీరు సంపూర్ణంగా రెఫరెన్స్ ప్రయోజనాల కొరకు మాత్రమే గానీ భవిష్య ఫలితాలకు హామీ కాదు.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.

285
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను