మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయా?

మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయా?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

అమ్యూజ్మెంట్ పార్కు గురించి అలోచించినప్పుడు మీరు ముందుగా రోలర్ కోస్టర్స్ని ఊహించుకుంటారా లేదా బొమ్మ రైలునా? బహుశా మొదటిది కావచ్చు. అట్టి పార్కులలో ఈ రైడ్స్ మామూలుగా అతిపెద్ద ఆకర్షణగా ఉంటాయి ఇవి అమ్యూజిమెంట్ పార్కుల గురించి నిర్దిష్ట భావనను ఏర్పురుస్తాయి. ‘మ్యూచువల్ ఫండ్స్’ కూడా అవి స్టాక్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయని అందుకే రిస్కుతో కూడినవి అనే భావన కలిగిస్తాయి. ప్రజల వివిధ ఇన్వెస్ట్మెంట్ అవసరాల కొరకు విభిన్న రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. కొందరు ఇన్వెస్టర్లు అధిక రిటర్నును కోరతారు, స్టాక్స్ మాత్రమే వీటిని ఇవ్వగలవు. అటువంటి ఇన్వెస్టర్లు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు ఇవి అట్టి ఉద్దేశ్యాలను సాధించడానికి అందుబాటులో ఉన్న ఉత్తమమైన దీర్ఘకాల ఇన్వెస్ట్మెంట్ ఎంపికలలో ఒకటి. కానీ విభిన్న కంపెనీల స్టాకులకు వాటి ఎక్స్పోజర్ ఉంటుంది కావున ఈ మ్యూచువల్ ఫండ్స్ అధిక ఒడుదుడుకులకు గురయ్యే ప్రమాదాన్ని కలిగి ఉన్నాయి.

ఇతర రకాలైన మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయవు అయితే బ్యాంకులు, కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు మరియు మనీమార్కెట్ ఇన్స్ట్రమెంట్లు (బ్యాంకు సిడిలు, టి-బిల్స్, కమర్షియల్ పేపర్స్) ద్వారా జారీ చేయబడిన బాండ్లలో పెట్టుబడి పెడతాయి, వీటికి తక్కువ రిస్కు ఉంది కానీ ఈక్విటీ ఫండ్స్‌తో పోల్చితే తక్కువ రిటర్నులను అందిస్తాయి. ఈ ఫండ్స్ సంప్రదాయపరమైన పెట్టుబడులు ,ఉదా:- బ్యాంక్ ఫిక్సిడ్ డిపాజిట్లు లేదా పిపిఎఫ్‌ల లాంటి ప్రత్యామ్నాయాలకు చక్కగా సరిపోతాయి. కావున, బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ ఎఫ్‌డిల కన్నా చక్కగా రిటర్నులు ఇచ్చే వాటిలో మీ డబ్బును ఇన్వెస్ట్ చేయాలనుకుని మరియు మరింత పన్నుల రాయితికి సరిపడా ఉండాలంటే, డెబిట్ మ్యూచువల్ ఫండ్స్ అట్టి ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి గొప్ప మార్గము. .
 

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను