లక్ష్యం-ఆధారంగా పెట్టుబడి: మీ ప్రతి లక్ష్యానికి ఎస్ఐపి పెట్టుబడులు

Video

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మనందరికీ జీవితంలో వివిధ లక్ష్యాలు ఉన్నాయి. కొన్నిసార్లు అవి మనకు వెంటనే కనిపిస్తాయి, మరికొన్నిసార్లు కాలక్రమేణా మన ముందుకు వస్తాయి. ఉదాహరణకు, ఉద్యోగం చేయడం ఆరంభించిన సమయంలో, రెగ్యులర్‌గా ఉండే నెలవారీ ఖర్చులు మరియు కొన్ని ఆకస్మిక కొనగోళ్ళు మినహా వారికి పెద్దగా లక్ష్యాలు ఉండకపోవచ్చు,. కానీ క్రమంగా, లక్ష్యాలు పెరుగుతాయి – బైక్ కానీ, కార్ గానీ, వారాంతపు షికార్లు, ఇంటర్నేషనల్ ట్రిప్స్, పెళ్ళి, ఇంకా ఎన్నో.

అయితే, మన ఆర్ధిక లక్ష్యాలు అన్నింటి కోసం ప్రణాళిక చేసుకునేందుకు సహాయపడడంలో మరియు జీవితంలో ఎదిగే కొద్దీ ఏర్పడగల కొత్త కొత్త లక్ష్యాల కోసం సిద్ధంగా ఉండేందుకు కూడా ఒక పరిష్కారం ఉంది:

సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ ఐపి)
ఎస్ఐపి ద్వారా ప్రతి నెలా మీరు ఒక చిన్న మొత్తాన్ని పెట్టుబడి చేయవచ్చు అంతేకాదు, మీరు లక్ష్యం-ఆధారంగా పెట్టుబడులు మొదలుపెట్టవచ్చు కూడా. ఈ విధంగా, పదవీవిరమణ, పెళ్ళి, మరియు ఒక కారు లేదా ఇల్లు కొనడం వంటి వివిధ లక్ష్యాల కొరకు మ్యూచువల్ ఫండ్లలో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మీరు ఉపయోగించవచ్చు. మదుపుదారుడు పొందే మొత్తం రాబడిని కాంపౌండింగ్ చేసినప్పుడు - భవిష్యత్తులో రాబడులు మరింత రాబడిని పొందుతాయి. ఇక్కడ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి మీరు మరింత చదవవచ్చు.

ఉదాహరణకు, మీరు మీ లక్ష్యం-ఆధారంగా పెట్టుబడులను క్రింది విధంగా ఆరంభించవచ్చు:

లక్షిత మొత్తం పెట్టుబడి కాలవ్యవధి  ఎంఎఫ్ స్కీం ఆశించిన రాబడులు* పెట్టుబడి మొత్తం
రూ. 1 లక్ష 2-3 సంవత్సరాలు డెట్ ఫండ్ 6-8% రూ.2,500 నెలకు
రూ. 4 లక్షలు 5 సంవత్సరాలు బ్యాలెన్స్డ్ ఫండ్ 10% రూ.5,000 నెలకు
రూ. 25 లక్షలు 10 సంవత్సరాలు ఈక్విటీ ఫండ్ 12% రూ.10,000 నెలకు
రూ. 10 లక్షలు 15 సంవత్సరాలు ఈక్విటీ ఫండ్ 12% రూ.2,000 నెలకు
రూ. 30 లక్షలు 20 సంవత్సరాలు ఈక్విటీ ఫండ్ 12% రూ.3,000 నెలకు
రూ. 1.5 కోట్లు 20 సంవత్సరాలు డెట్ ఫండ్ 8% రూ.30 లక్షలు (ఏకమొత్తంగా)

*ఎంఫ్ కేటగిరీకి ఊహించిన రాబడులు
గమనిక: విశదీకరణ ప్రయోజనాలకు మాత్రమే;వాస్తవ అంకెలు మార్కెట్ రిస్క్ ఆధారంగా మారవచ్చు.

మీ ప్రతి లక్ష్యానికి దీర్ఘకాలిక ఎస్ఐపి పెట్టుబడి మొత్తాలను మీరు మార్చవచ్చు. ఉదాహరణకు, వాహనాన్ని కొనాలనే మీ కల నెరవేరగానే, ఇతర లక్ష్యాల కొరకు, ప్రతి దానికీ రూ.2000 చొప్పున ఎస్ఐపి మొత్తాన్ని మీరు పెంచవచ్చు. అలా చేయడం ద్వారా, ముందుగా ఊహించిన దానికన్నా మీ లక్ష్యాల కొరకు మరింత సంపదను మీరు కూడబెట్టవచ్చు.
పదవీ విరమణ తర్వాత, మీరు మీ పెట్టుబడులను రిస్కు తక్కువగా ఉండే ఫండ్‌కు మార్చాలని అనుకోవచ్చు, అవి మీరు రిస్కుకు బహిర్గతం కాగల అవకాశాన్ని తగ్గించేందుకు స్వల్ప రిస్కుతో కూడుకున్న డెట్ ఉపకరణాలలో పెట్టుబడి చేస్తాయి. మీ పదవీ విరమణ తర్వాత సైతం రాబడులను పొందడాన్ని ఇది కొనసాగిస్తుంది. వాస్తవానికి, సిస్టమ్యాటిక్ విత్ డ్రావల్ ప్లాన్ ద్వారా మీ ఆనుషంగిక రాబడి మూలాన్ని మీరు పొందడంలో కూడా ఈ పెట్టుబడులు సహాయపడతాయి.

ఈ విధంగా, మీ లక్ష్యాల ఆధారంగా ఒక ఉచిత వ్యవధి కోసం ఎస్ఐపి ద్వారా వివిధ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి చేయడం వలన వివిధ సమయాల వద్ద జీవితంలో మీ కలలు మరియు లక్ష్యాలు అన్నింటినీ సాధించడంలో మీకు సహాయపడవచ్చు.

*మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.

పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను