మ్యూచ్‌‌వల్ ఫండ్స్ చాలా కాలం నుండి ఉన్నాయా?

మ్యూచ్‌‌వల్ ఫండ్స్ చాలా కాలం నుండి ఉన్నాయా?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

కొంత కాలంగా ప్రపంచం అంతటా విభిన్న సాంప్రదాయ ఫార్మాట్లలో కలెక్టివ్ మరియు పూల్డ్ ఇన్వెస్ట్‌మెంట్లు ఉన్నాయి. మ్యూచ్‌వల్ ఫండ్స్ మనకు తెలిసి 1924 నుండి మాసాచుసెట్స్ ఇన్వెస్టర్స్ ట్రస్ట్‌ ఏర్పాటుతో ప్రారంభమయ్యాయి.

మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ పెరుగుదల మూడు విస్తారమైన ట్రెండ్లను కలిగి  ఉండింది:

  1. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు మ్యూచు‌వల్ ఫండ్స్‌ను  స్వీకరించటంతో  మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలోని అసెట్లలో ప్రశంసనీయమైన పెరుగుదల -.
  2. ఇన్వెస్టర్‌ పరిరక్షణ మరియు ఫండ్ మేనేజ్‌మెంట్ ఇండస్ట్రీ యొక్క సరియైన పర్యవేక్షణను ధ్రువీకరించే కఠినతరమైన నియంత్రణ.
  3. విభిన్న కస్టమర్ల అవసరాలకు సరిపోయే  మరిన్ని సృజనాత్మక ఉత్పత్తులను ప్రవేశపెట్టడం; దీర్ఘకాల రిటైర్మెంట్ ప్లాన్ నుండి  స్వల్పకాలిక క్యాష్ మేనేజ్‌మెంట్ వరకు.

ఇండియాలో మ్యూచ్‌వల్ ఫండ్స్ 1963 నుండి, యూనిట్ ట్రస్ట్‌ ఆఫ్ ఇండియా (యుటిఐ) స్థాపించినప్పటి నుండి ఉన్నాయి. యుటిఐ భారత ప్రభుత్వం మరియు భారతీయ రిజర్వ్ బ్యాంకు ద్వారా స్థాపించబడినది. ఆగస్టు 1964 లో ప్రారంభించబడిన యూనిట్ స్కీము 64, మొదటి మ్యూచ్‌వల్ ఫండ్ స్కీము.

1987లో, ఇతర పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు మరియు సంస్థలు మ్యూచువల్ ఫండ్స్ ప్రారంభించడానికి అనుమతించబడినాయి. 1993లో, లిబరలైజేషన్ వేవ్ తరువాత, ప్రైవేట్ సెక్టార్ మరియు విదేశీ ప్రాయోజితులు మ్యూచు‌వల్ ఫండ్స్ ప్రారంభించడానికి అనుమతించబడ్డారు.

మ్యూచువల్  ఫండ్ ఇండస్ట్రీ  పరిమాణం, నైపుణ్యం మరియు పెట్టుబడిదారులని చేరుకోవడం అనేవాటిని వేగంగా సాధించింది. మార్చి 31, 2022 నాటికి, ఇండియాలో మ్యూచ్‌వల్ ఫండ్స్  37.7  లక్ష కోట్లు మించిన అసెట్లను నిర్వహించింది.

404
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను