ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ మీరు తెలుసుకోవలసిన విషయాలు

ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ మీరు తెలుసుకోవలసిన విషయాలు

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఒకే పెట్టుబడి ద్వారా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్‌లకు యాక్సెస్ కల్పిస్తాయి. ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాలు ఓపెన్-ఎండెడ్గా ఉంటాయి మరియు వివిధ రంగాలలో విభిన్న మార్కెట్ క్యాపిటలైజేషన్‌లు ఉన్న కంపెనీలను ఎంచుకోవడంలో ఫండ్ మేనేజర్ؚకు వెసులుబాటును కలిపిస్తాయి.

ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ؚలో ఇన్వెస్ట్ చేయగల కంపెనీ పరిమాణం లేదా రకంపై ఎటువంటి పరిమితులు లేవు. ఈ బహుముఖ విధానం దీనిని మీకు మరియు పెట్టుబడిదారులు అందరికి ఆకర్షణీయమైన పెట్టుబడి ఎంపికగా నిలుస్తాయి.


ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ؚలో ఇన్వెస్ట్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ؚలో పెట్టుబడి పెట్టడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కొన్ని ముఖ్య ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

  1. డైవర్సిఫికేషన్: ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ؚతో, మీ డబ్బు విభిన్న రిస్క్ మరియు రాబడిని అందించే స్టాక్ؚలలో విస్తరించి ఉంటుంది.
  2. ఫ్లెక్సిబిలిటీ: ఈ ఫండ్స్ వివిధ రంగాలు, మార్కెట్ క్యాపిటలైజేషన్‌లలో ఏ పరిమాణంలోనైనా కంపెనీలలో పెట్టుబడి పెట్టె స్వేచ్ఛను అందిస్తాయి. విస్తృత నిర్వచనంతో, ఫండ్ మేనేజర్లు బెంచ్ؚమార్క్ కంటే మెరుగైన రాబడిని పొందడానికి కొనుగోలుచేయడానికి మరియు విక్రయించడానికి ఎక్కువ స్టాక్ؚలను కలిగి ఉంటారు.
  3. డైనమిక్ అసెట్ అలోకేషన్: ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ؚలో, ఫండ్ మేనేజర్ లార్జ్-క్యాప్, మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ స్టాక్స్ మధ్య కేటాయింపులను ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను బట్టి సర్దుబాటు చేయగలరు. అడాప్టివ్ విధానం మారుతున్న మార్కెట్ డైనమిక్స్ؚకు ప్రతిస్పందించడానికి మరియు రాబడులను ఆప్టిమైజ్ చేయడానికి ఫండ్ؚను అనుమతిస్తుంది.
  4. ప్రొఫెషనల్ మేనేజ్మెంట్: ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ؚలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్‌ల నైపుణ్యం, పరిజ్ఞానాన్ని పొందుతారు.


డిస్క్లైమర్
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.

284
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను