లిక్విట్ ఫండ్ల కన్నా ఓవర్‌నైట్ ఫండ్లు వైవిధ్యంగా ఉంటాయి, ఎలా?

లిక్విట్ ఫండ్ల కన్నా ఓవర్‌నైట్ ఫండ్లు వైవిధ్యంగా ఉంటాయి, ఎలా? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

కాలపరిమితి, రిస్క్ ప్రొఫైల్ విషయాలలో డెబ్ట్ ఫండ్లలో లిక్విడ్ ఫండ్ల కన్నా దిగువన ఉండే వాటిలో ఓవర్‌నైట్ ఫండ్లు మొదటివి.. మరుసటి రోజున మెచూర్ అయ్యే డెబ్ట్ సెక్యూరిటీలలో ఓవర్‌నైట్ ఫండ్లు పెట్టుబడి చేస్తాయి. 91 రోజులలో మెచూర్ అయ్యే డెబ్ట్ సెక్యూరిటీలలో లిక్విడ్ ఫండ్లు పెట్టుబడి చేస్తాయి. కాబట్టి, ఓవర్‌నైట్ ఫండ్ల కన్నా లిక్విడ్ ఫండ్లలో అధిక వడ్డీ రేటు, క్రెడిట్, డీఫాల్ట్ రిస్క్ ఎక్కువగా ఉండే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే మెచూర్ అవుతున్న సెక్యూరిటీలు ఫండ్‌ మేనేజరు ద్వారా అమ్మబడినప్పుడు ఓవర్‌నైట్ ఫండ్లలో నగదు మరుసటి రోజునే తిరిగి వస్తుంది.

మీ సర్ప్లస్ నగదును ఒక వారం కన్నా తక్కువ ఉంచేందుకు ఓవర్‌నైట్ ఫండ్లు ప్రాధాన్యమైనవి, ఎందుకంటే వాటికి నిష్క్రమణ భారం ఉండదు. లిక్విడ్ ఫండ్లలో ఆరు రోజుల దాకా గ్రేడెడ్ నిష్క్రమణ భారం ఉంటుంది, 7 రోజు నుండి నిష్క్రమణ భారం ఉండదు. వాటి వాటి క్రెడిట్ నాణ్యతతో సంబంధం లేకుండా 91 రోజులలోపు మెచూర్ అయ్యే సిడిలు, సిపిలు వంటి ఏదేని నగదు వాణిజ్య ఉపకరణాలలో పెట్టుబడి చేసే స్వేచ్ఛ లిక్విడ్ ఫండ్లకు ఉంటుంది. కాబట్టి, ఓవర్‌నైట్ ఫండ్ల కన్నా అధిక క్రెడిట్ రిస్కును అవి కలిగి ఉండగలవు.

ఓవర్‌నైట్ ఫండ్లతో పోలిస్తే, లిక్విడ్ ఫండ్ల పోర్ట్‌ఫోలియో మెచూరిటీ ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి క్రెడిట్ రిస్క్ నిర్వహణలో కొద్దిగా గాలివాటాన్ని లిక్విడ్ ఫండ్లు చూపుతాయి, కనుక ఓవర్‌నైట్ ఫండ్ల కన్నా అవి అధిక రాబడిని ఇవ్వగలవు. ఏ సమయంలోనైనా తలెత్తగల అవసరానికి సులభంగా విత్‌డ్రా చేసుకోవడం అనేది మీ ప్రాధాన్యత అయితే, ఓవర్‌నైట్ ఫండ్లు ఎంచుకోవాలి. ఒక వారం సమయంలో మీ సర్ప్లస్ నగదును ఉంచే సమయంలో రాబడి కొరకు మీరు చూస్తున్నట్లైతే, లిక్విడ్ ఫండ్లను ఎంచుకోవాలి.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను