పెట్టుబడి పెట్టేటప్పుడు పుకార్లను ఎదుర్కోవడం ఎలా?

Video
కాలిక్యులేటర్లు

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

తరువాత క్షణంలో మార్కెట్ ఎటు వెళుతుందనేది ఊహించలేక పోవడం వలన స్టాక్ మార్కెట్‌లో డబ్బు పోగొట్టుకున్న లేదా మార్కెట్ తదుపరి ఎలా ముందుకుపోతుందో తెలియడం వలన డబ్బు సంపాదించిన మీకు తెలిసిన వ్యక్తులను మీరు ఎంత తరచుగా చూశారు? అత్యుత్తమ మార్కెట్ విశ్లేషకులు కూడా తరువాత క్షణంలో మార్కెట్‌లో ఏలా ముందుకు సాగుతుందని దో పూర్తి ఖచ్చితత్వంతో ఊహించలేరు, ఎందుకంటే మార్కెట్లు సెంటిమెంట్లనుబట్టి నడుస్తాయి, మార్కెట్ సెంటిమెంట్లు మార్కెట్ వార్తలపై ఆధారపడి నడుస్తాయి.    

ఈరోజుల్లో పెట్టుబడిదారుకు మార్కెట్ వార్తలు సులభంగా అందుబాటులో ఉన్నాయి, అవి వాస్తవంగా సరైనవి కావచ్చు, పుకారు కావచ్చు లేదా కేవలం ఊహ కావచ్చు. వాస్తవంగా సరైన వార్తలపై ఆధారపడిన పెట్టుబడి నిర్ణయాలు సానుకూల ఫలితాలు ఇవ్వవచ్చు, అదే పుకార్లు లేదా ఊహలపై ఆధారపడిన పెట్టుబడి నిర్ణయాలు పెట్టుబడిదారులకు నష్టం కలిగించవచ్చు. 

ప్రవర్తనా ఆర్థిక సిద్ధాంతం ప్రకారం, పెట్టుబడిదారులు స్వభావరీత్యా అహేతుకంగా ఉంటారు, అంటే వారి పెట్టుబడి ప్రవర్తన పరిశోధన మరియు విశ్లేషణపై ఆధారపడకుండా గుంపు మనస్తత్వంతో సహా వివిధ అభిజ్ఞా మరియు భావోద్వేగాల ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది.   కాబట్టి, ఏ తప్పుడు మార్కెట్ సమాచారం అయినా పెట్టుబడిదారులలో భయాందోళనలు కలిగించగలదు, ఇది పెట్టుబడిదారుడి సంపద పెద్దయెత్తున క్షీణించడానికి దారితీస్తుంది.

మార్కెట్ అంతా ధృవీకరించిన వాటి నుండి పుకార్ల వరకు గల అన్ని రకాల వార్తలతో నిండిపోయినప్పుడు ఒక పెట్టుబడిదారుడు తనను తాను ఎలా స్థిరంగా ఉంచుకోగలడు? ఇక్కడే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు విస్తృత పరిశోధన మరియు విశ్లేషణ చేసే సామర్థ్యం మరియు వనరులు లేని లక్షలాది చిన్న పెట్టుబడిదారులను కాపాడటానికి ఉపయోగపడతాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం  పైన పేర్కొన్న అన్ని సమస్యలను తప్పించుకోవడానికి దోహదపడుతుంది, ఎందుకంటే వృత్తిపరమైన ఫండ్ మేనేజర్లు మీ తరపున పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటారు.

ఫండ్ మేనేజర్ల వద్ద పరిశోధనా విశ్లేషకుల బృందం ఉంటుంది, వీరు ప్రతి సెక్యూరిటీని కొనడం, నిలిపి ఉంచడం మరియు విక్రయించడం గురించి నిర్ణయం తీసుకోవడానికి ముందు దానిని మూల్యాంకనం చేయడానికి మొత్తం బహిరంగంగా లభ్యమవుతున్న సమాచారం మీద ఆధారపడి విస్తృతమైన పరిశోధన చేస్తారు. ఫండ్ పోర్ట్‌ఫోలియో లోని ఏదైనా సెక్యూరిటీ గురించి కొన్ని మార్కెట్ న్యూస్ మీకు తెలిస్తే లేదా ఆందోళనగా అనిపిస్తున్న ఫండ్ గురించి మీరు సెబీలో రిజిస్టర్ చేసుకున్న పైనాన్సియల్ సలహాదారును లేదా మ్యూచువల్ ఫండ్‌ డిస్ట్రిబ్యూటర్‌ను అన్నివేళలా సంప్రదించవచ్చు.

402
481
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను