డెబిట్ ఫండ్స్ నుండి నా రిటర్నుని వడ్డీ రేటు మార్పులు ఎలా ప్రభావితం చేస్తాయి?

డెబిట్ ఫండ్స్ నుండి నా రిటర్నుని వడ్డీ రేటు మార్పులు ఎలా ప్రభావితం చేస్తాయి?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

డెట్ ఫండ్స్ స్థిర ఆదాయం సెక్యూరిటీలైన కార్పొరేట్ లేదా గవర్నమెంట్ బాండ్లు మరియు మనీ మార్కెట్ ఇన్స్ట్రమెంట్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ సెక్యూరిటీలు ఇంట్రస్ట్ బేరింగ్ ఇన్స్ట్రమెంట్లు ఇవి ఇన్వెస్టర్లకు రెగ్యులర్ అంతరాలలో ఒక ఫిక్సిడ్ వడ్డీని (కూపన్ రేట్) చెల్లిస్తాయి మరియు ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని (అసలు) మెచ్యూరిటీ అయినప్పుడు చెల్లిస్తాయి. ఈ సెక్యూరిటీల ధరలు వడ్డీ రేటు మార్పుతో నేరుగా ప్రభావితం అవుతాయి. బాండ్ ధరలు మరియు వడ్డీ రేట్లు విలోమా అనుపాతంలో ఉంటాయి.

ఒక బాండు కూపన్ రేటు బాండు మొదటిసారి జారీ చేసనప్పుడు ఒక నిర్దిష్ట ధర వద్ద (ఫేస్ వాల్యు) ఫిక్స్ చేయబడుతుంది. వడ్డీ రేట్లు కూపన్ రేట్ కన్నా తక్కువగా పడిపోతే, మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న దానికన్నా అధిక వడ్డీని కలిగి ఉంటుంది కావున బాండ్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కావున, అట్టి బాండ్ల కొరకు డిమాండ్ పెరిగి, వాటి ధరలను పెంచుతుంది. వడ్డీ రేట్లు పెరిగితే, ఈ బాండ్లు అనాకర్షితంగా కనిపిస్తాయి మరియు తక్కువ డిమాండ్ వల్ల వాటి ధరుల పడిపోతాయి.

వడ్డీ రేట్లు పెరిగినప్పుడు, స్థిర ఆదాయం సెక్యూరిటీల ధరలు పడిపోతాయి. ఇది వారి పోర్ట్ఫోలియోలో సెక్యూరిటీలు కలిగిన స్థిర ఆదాయం ఫండ్స్ యొక్క ఎన్ఎవి విలువలో తగ్గదలకు దారితీస్తుంది. ఇంకోవైపు, వడ్డీ రేట్లు పడిపోయినప్పుడు, ఫిక్స్డ్ ఇన్కం సెక్యూరిటీల ధరలు పెరిగి, ఫిక్స్డ్ ఇన్కం ఫండ్స్ యొక్క ఎన్ఎవిల పెరుగుదలకు దారితీస్తుంది. అలా, వడ్డీ రేట్లు పడిపోయినప్పుడు స్థిర ఆదాయం ఫండ్ పెట్టుబడి నుండి మీరు అనుకూల రిటర్నుని పొందుతారు. అలాగె వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ప్రతికూల రిటర్న్ లు పొందుతారు.

s

 

408
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను