మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ؚఫోలియోను మొదటి నుండి ఎలా నిర్మించాలి?

మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ؚఫోలియోను మొదటి నుండి ఎలా నిర్మించాలి? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మ్యూచువల్ ఫండ్‌లు అనువైన పెట్టుబడి ఎంపిక, ఎందుకంటే అవి ఆస్తి తరగతి, రిస్క్‌లు, పెట్టుబడి మొత్తాలు మరియు లిక్విడిటీ పరంగా విస్తృత పరిధిని అందిస్తాయి. కానీ, మ్యూచువల్ ఫండ్ పోర్ట్ؚఫోలియోను నిర్మించడంలో మొదటి అడుగు వేయడం ప్రారంభకులకు సవాలుగా ఉంటుంది. మీరు కొన్ని ప్రాథమిక మార్గదర్శక సూత్రాలతో మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ؚఫోలియోను ఏర్పాటు చేసుకోవచ్చు. 

మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ؚఫోలియోను నిర్మించడానికి దశల వారీ గైడ్:

  • మీ రిస్క్ టాలరెన్స్‌ను అర్థం చేసుకోండి: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు మీరు తీసుకునే రిస్క్ స్థాయిని మీ రిస్క్ టాలరెన్స్ అంటారు. మీ పెట్టుబడుల కోసం మీరు ఎంత రిస్క్ తీసుకోగలరో తెలుసుకోగలిగితే, మీకు అనువైన ఫండ్‌ల రకాలను మీరు నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు, మీరు అధిక-రిస్క్ టాలరెన్స్ కలిగి ఉంటే, మీరు ఈక్విటీలలో గరిష్ట కేటాయింపు పొందవచ్చు, అయితే మీరు రిస్క్-విముఖత కలిగిన పెట్టుబడిదారు అయితే డెట్ ఫండ్‌లు మీకు అనుకూలంగా ఉంటాయి. 
  • లక్ష్యాలను గుర్తించడం: లక్ష్యాలు ఒక కీలకమైన అంశం ఎందుకంటే భవిష్యత్తులో తీసుకునే ఇతర నిర్ణయాలన్నీ వాటిపై ఆధారపడి ఉంటాయి. లక్ష్యాల ద్వారా, పెట్టుబడి యొక్క అనేక ఇతర లక్షణాలతో పాటు మీరు పెట్టుబడి మొత్తాన్ని మరియు సమయాన్ని నిర్ణయించవచ్చు. అంతేకాకుండా, మీ లక్ష్యాలను సమీకృతం చేయడంతో, మీరు ప్రతి మ్యూచువల్ ఫండ్‌ను ఒక నిర్దిష్ట ఆర్థిక లక్ష్యానికి ట్యాగ్ చేయవచ్చు. 
  • మీ ఫండ్స్ؚను ఎంచుకోండి: మీ ఆర్థిక లక్ష్యాలు మరియు మీ రిస్క్ సామర్థ్యం గురించి మీరు తెలుసుకున్న తర్వాత, మీరు ఈ బ్రాకెట్లలో సరిపోయే ఫండ్లను ఎంచుకోవచ్చు. 
  • ఆస్తి కేటాయింపు: ఆస్తి కేటాయింపు, లేదా వివిధ ఆస్తి తరగతులలో మీ పెట్టుబడిని వైవిధ్యపరచడం అనేది మీ పోర్ట్ؚఫోలియోను సమతుల్యంగా ఉంచే ముఖ్యమైన అంశం. బ్యాలెన్స్‌డ్ పోర్ట్ؚఫోలియో అంటే ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ తదితర విభాగాల్లో పెట్టుబడులు విస్తరించి ఉంటాయి. ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే మార్కెట్ పరిస్థితుల ఆధారంగా వివిధ ఆస్తి తరగతులు భిన్నంగా పనిచేస్తాయి మరియు ఇది రిస్క్ వైవిధ్యభరితంగా ఉంటుందని నిర్ధారిస్తుంది.
  • మానిటర్, రివ్యూ, మరియు రీబ్యాలెన్స్: మీ పెట్టుబడులను పర్యవేక్షించడం, సమీక్షించడం మరియు తిరిగి సమతుల్యం చేయడం చివరి దశ; ఇక్కడ, మీరు మీ పెట్టుబడులను పునఃసమీక్షించాలి మరియు వైవిధ్యం, పెట్టుబడి ఫ్రీక్వెన్సీ, ఆస్తులను తిరిగి సమతుల్యం చేయడం మరియు మరెన్నో అంశాలను నిర్ణయించాలి. మీరు మీ మ్యూచువల్ ఫండ్‌ల పనితీరును సమీక్షించవచ్చు మరియు దీర్ఘకాలం పాటు అవి మెరుగైన పనితీరును కనబరచకపోతే, మీరు మెరుగైన వాటికి మారవచ్చు. 

 

డిస్క్లైమర్

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.

285
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను