మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ఎలా?

మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం ఎలా? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మ్యూచువల్ ఫండ్స్‌లో చాలా సౌకర్యవంతంగా పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ సాధనాలలో పెట్టుబడి పెట్టడం సులభం, ఇవి సరళమైనవి, మరియు పెట్టుబడిదారులు క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళిక పద్ధతి ద్వారా రూ.500తో కూడా పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టడానికి కొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి. 

మ్యూచువల్ ఫండ్ؚలో పెట్టుబడి పెట్టడానికి వివిధ మార్గాలు:

  • మ్యూచువల్ ఫండ్, ISCలు (పెట్టుబడిదారుల సేవా కేంద్రాలు) లేదా RTAల (రిజిస్ట్రార్ మరియు బదిలీ ఏజెంట్లు) సమీప బ్రాంచ్ కార్యాలయాన్ని సందర్శించడం ద్వారా. 
  • AMFIలో రిజిస్టర్ అయిన ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా. డిస్ట్రిబ్యూటర్ ఒక వ్యక్తి, బ్యాంకు, బ్రోకర్ కావచ్చు లేదా వేరెవరైనా కావచ్చు. 
  • ఆన్లైన్ ఫ్లాట్ؚఫామ్ؚలు లేదా ఫండ్ హౌస్ؚల పోర్టల్స్ ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. 

ప్రతి పెట్టుబడిదారుడి ప్రాధాన్యత మరియు నైపుణ్యం భిన్నంగా ఉంటుంది, అందరికీ సరిపోయే పద్ధతి అంటూ ఏది ఉండదు. కానీ ఈ పద్ధతులను స్థూలంగా - ఆన్లైన్ మరియు ఆఫ్లైన్గా వర్గీకరించవచ్చు.  

a) ఆన్లైన్: పెట్టుబడిదారు ఫండ్ హౌస్లు, ఆన్లైన్ ప్లాట్ؚఫామ్ؚల పోర్టల్ ద్వారా ఆన్లైన్ؚలో మ్యూచువల్ ఫండ్ ఖాతాలను తెరవవచ్చు. 

b) ఆఫ్లైన్: ఆఫ్లైన్ ఖాతాను తెరవడానికి పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ లేదా సమీప మ్యూచువల్ ఫండ్స్ బ్రాంచ్ కార్యాలయాన్ని కూడా సంప్రదించవచ్చు. 

మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టే విధానాన్ని సరళంగా ఇలా వివరించవచ్చు:

  • ఒక ప్లాట్ఫారమ్ లేదా ఫండ్ హౌస్ని ఎంచుకోండి. 
  • ఎంచుకున్న ప్లాట్ఫారమ్లో మీ వివరాలతో నమోదు చేయండి. 
  • KYCని పూర్తి చేయండి. 
  • మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్న ఫండ్ؚను ఎంచుకొని, మీ బ్యాంక్ ఖాతాను లింక్ చేయండి. 
  • మొత్తాన్ని పేర్కొనడం మరియు పెట్టుబడి విధానాన్ని ఎంచుకోవడం ద్వారా పెట్టుబడిని ప్రారంభించండి. 
  • నిధులను బదిలీ చేయండి మరియు మీరు మీ ఫండ్ పనితీరును ట్రాక్ చేయడం ప్రారంభించవచ్చు. 

మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టడానికి ఉత్తమ మార్గం పెట్టుబడిదారుడి ఎంపికపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న పెట్టుబడిదారుడు ఆన్లైన్లో పెట్టుబడి పెట్టడాన్ని ఎంచుకోవచ్చు. 

డిస్క్లైమర్

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.

287
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను