నా పెట్టుబడిలో నేను ఎంత విత్‌డ్రా చేసుకోగలను?

నా పెట్టుబడిలో నేను ఎంత విత్‌డ్రా చేసుకోగలను?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మ్యూచువల్‌ ఫండ్ స్కీములు ఎక్కువగా ఓపెన్ ఎండ్ స్కీములు, ఇవి ఇన్వెస్టర్‌కు ఎటువంటి సమయ పరిమితులు లేకుండా మొత్తం పెట్టుబడి సొమ్మును రీడిం చేసుకునే వీలు కల్పిస్తాయి.

కొన్ని సందర్భాలలో మాత్రమే  బోర్డ్ ఆఫ్ ట్రస్టీల ద్వారా నిర్ణయించినట్లు, అసాధారణ పరిస్థితుల క్రింద, స్కీములు రిడెంషన్ పైన ఒక పరిమితిని విధిస్తాయి.

అన్ని ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీములు (ఇఎల్ఎస్ఎస్), సెక్షన్ 80సి క్రింది పన్ను ప్రయోజనాలు అందించేవి, 3 సంవత్సరాల కాలానికి పెట్టుబడులలో ‘లాక్ ఇన్’ అవ్వాలి. అయితే, ఈ కాలంలో ఈ స్కీముల ద్వారా ప్రకటించబడిన ఏవైనా డివిడెంట్‌లు పరిమితులు లేకుండా చెల్లింపు అందుబాటులో ఉంటుంది. ఇతర కేటగిరీ స్కీములు ఏవీ అట్టి లాక్-ఇన్‌ని విధించవు. గడువుకన్నా ముందు రిడెంషన్లకు కొన్ని స్కీములు, స్కీములో స్వల్పకాల ప్రవేశాన్ని నివారించడానికి ఎగ్జిట్-లోడ్‌ని విధించవచ్చు. ఎఎమ్‌సిలు సమర్పించవలసిన కనీస మొత్తాన్ని తెలపవచ్చు. అట్టి సమాచారం స్కీముకు సంబధించిన డాక్యుమెంట్లలో ఉఁటుంది, దీనిని పెట్టుబడికి ముందు ఇన్‌వెస్టర్ చదవడం ముఖ్యము.

క్లోజ్డ్ ఎండ్ స్కీములకు స్థిరమైన కాలపరిమితి ఉంటుంది మరియు ఆపివేయడం/ముగింపు తేదీ వరకు ఎఎమ్‌సి ఎటువంటి రిడెంషన్‌కి ఫండ్ చేయదు లేదా అనుమతించదు. అయితే, అన్ని క్లోజ్డ్ ఎండ్ ఫండ్స్ వాటి యూనిట్లు స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో లిస్ట్ చేయబడతాయి మరియు లిక్విడిటి కొరకు చూస్తున్న ఇన్‌వెస్టర్ యూనిట్లను మార్కెట్ నిర్ధారిత రేటులో యూనిట్లను అమ్మాలి.

405
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను