NAV ఎలా లెక్కించబడుతుంది?
59 సెకన్ల పఠన సమయం

మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో నెట్ అసెట్ వాల్యూ (NAV) అనేది ఒక ముఖ్యమైన అంశం. ఇది మ్యూచువల్ ఫండ్ యూనిట్ విలువను మరియు మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడిదారులు ప్రతి యూనిట్‌ను కొనుగోలు చేసే లేదా విక్రయించే ధరను సూచిస్తుంది.
ప్రతి రోజు చివరిలో NAV అప్డేట్ చేయబడుతుంది. మ్యూచువల్ ఫండ్ పనితీరును ట్రాక్ చేయడంలో NAV కీలకం. వివిధ కాలాల్లో NAVని పోల్చడం ద్వారా ఫండ్ పనితీరు ఎలా ఉందో ఇన్వెస్టర్లు అంచనా వేయవచ్చు. NAVను క్రమం తప్పకుండా లెక్కించడం మరియు ప్రచురించడం అనేది పెట్టుబడిదారులకు వారి పెట్టుబడుల విలువకు సంబంధించి పారదర్శకతను అందిస్తుంది.
NAVని లెక్కించడానికి, మీరు ఫండ్ అప్పులను దాని మొత్తం ఆస్తి విలువ నుండి తీసివేసి, ఫండ్ మొత్తం బకాయి యూనిట్ల ద్వారా విభజించాలి.
ఒక ఆస్తి నికర విలువ = (టోటల్ అసెట్ - టోటల్ లయబిలిటీస్) / ఫండ్ మొత్తం బకాయి యూనిట్లు
NAV ఎలా లెక్కించబడుతుందో మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ఒక దృష్టాంతాన్ని ఉపయోగిద్దాం.
ఈ క్రింది వివరాలతో మ్యూచువల్ ఫండ్‌ను పరిగణించండి-
> పోర్ట్ ఫోలియోలోని సెక్యూరిటీల మార్కెట్ విలువ: 50 కోట్లు
> నగదు: 5 కోట్లు
> మొత్తం అప్పులు: 6 కోట్లు
> మొత్తం బకాయి యూనిట్ల సంఖ్య: 10 లక్షలు
ఇప్పుడు, ఫార్ములాను ఉపయోగించి NAVని లెక్కిద్దాం:
ఒక ఆస్తి నికర విలువ = (టోటల్ అసెట్* – టోటల్ లయబిలిటీస్) / ఫండ్ మొత్తం బకాయి యూనిట్లు
= (50,00,00,000+5,00,00,000−6,00,00,000)/ 10,00,000
= 490
*మొత్తం ఆస్తులు = సెక్యూరిటీల మార్కెట్ విలువ ప్లస్ నగదు (50,00,00,000+5,00,00,000)
వ్యాఖ్యానం
మ్యూచువల్ ఫండ్ NAV రూ. 490. అంటే మ్యూచువల్ ఫండ్‌లో ఒక్కో యూనిట్ విలువ రూ. 490.
భారతదేశంలో, NAVని ప్రతి రోజు చివరిలో లెక్కిస్తారు. ఈ విలువ ఫండ్ పోర్ట్ ఫోలియోలోని సెక్యూరిటీల ముగింపు ధరలను ప్రతిబింబిస్తుంది. పారదర్శకతను నిర్ధారించడానికి మరియు పెట్టుబడిదారుల ప్రయోజనాలను రక్షించడానికి NAV లెక్కింపు మరియు బహిర్గతం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ద్వారా నియంత్రించబడుతుంది.
డిస్క్లైమర్
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.