ఎంత తరచుగా నేను నా డబ్బును తీసుకోవచ్చు?

ఎంత తరచుగా నేను నా డబ్బును తీసుకోవచ్చు?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

ఇన్‌వెస్టర్ ఓపెన్ ఎండెడ్ స్కీము నుండి డబ్బుని రీడిం చేసుకోవడంలో పరిమితి లేదు. కాగా కొన్ని సందర్బాలలో ఎగ్జిట్ లోడ్ ఉంటుంది, ఇది విడుదల చేసే తుది మొత్తం పైన ప్రభావాన్ని చూపుతుంది, అన్ని ఓపెన్ ఎండ్ స్కీములు గొప్ప ప్రయోజనంగా లిక్విడిటీని అందిస్తాయి.

రిడీం చేయాలనే నిర్ణయం పూర్తిగా ఇన్వెస్టర్ విచక్షణ మేరకు ఉంటుంది. రిడెంషన్ల సంఖ్య పైన లేదా రీడిం చేసుకోవలసిన మొత్తం పైన పరిమితులు లేవు. ఫండ్ రిడెంషన్ల కొరకు అకౌంట్‌లో తగినన్ని యూనిట్లు ఉండాలి. కొన్ని స్కీము డాక్యుమెంట్లు రీడిం చేసుకునే కనీస మొత్తాన్ని సాధారణంగా సూచిస్తాయి.

ఒఖ బ్యాంకు లేదా సంస్థకు హక్కు కింద ఉన్నవి హక్కు తొలగించితే తప్ప రిడీం చేయబడవు. బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ద్వారా నిర్ణయించబడినట్లు, అసాధారణమైన పరిస్థితులలో రిడెంషన్లు పరిమితం చేయవచ్చు.

క్లోజ్డ్ ఎండ్ స్కీములను మెచ్యూరిటీ తరువాత మాత్రమే ఎఎమ్‌సి నుండి రిడీం చేసుకోవచ్చు. అయితే, వారు లిక్విడిటీకి మార్గాన్ని - మెచ్యూరిటీకంటె ముందు ఏసమయంలోనైనా - గుర్తింపు పొందిన ఎక్స్‌ఛేంజ్ ద్వారా యూనిట్లను అమ్మడం ద్వారా అందిస్తారు.

రిడెంషన్లు ఇక్కడ చేయవచ్చు;

  • ఇన్‌వెస్టర్ సర్వీస్ సెంటర్స్ (ఐఎస్‌సి లు)
  • ఎఎమ్‌సి ఆఫీసులు
  • లావాదేవీలు అంగీకరించే అధికార ప్రదేశాలు (ఒపిఎటి)
  • అధీకృత ఆన్-లైన్ ప్లాట్‌ఫారం ద్వారా.
405
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను