ఓవర్‌నైట్ ఫండ్లు ఎలా సురక్షితమైనవి?

ఓవర్‌నైట్ ఫండ్లు ఎలా సురక్షితమైనవి?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

రిస్కు లేని మ్యూచువల్ ఫండ్ల కోసం మీరు చూస్తుంటే, అలాంటివి ఏవీ లేవు! అన్ని మ్యూచువల్ ఫండ్లు కొంత రిస్కు లేదా మరోదానికి లోబడి ఉంటాయి. ఈక్విటి ఫండ్లు మార్కెట్ రిస్కుకు లోబడి ఉంటే, డెట్ ఫండ్లు వడ్డీ రేటు రిస్కు మరియు డీఫాల్ట్ రిస్కుకు లోబడి ఉంటాయి. డెట్ ఫండ్లలలో, పోర్ట్‌ఫోలియో సగటు పరిపక్వత మీద ఆధారపడి రిస్కు స్థాయి వేరువేరుగా ఉంటుంది. ఒక డెట్ ఫండ్ పోర్ట్‌ఫోలియో పరిపక్వత ఎంత ఎక్కువ ఉంటే, వడ్డీ రేటు రిస్కు మరియు డీఫాల్ట్ రిస్కు అంత ఎక్కువ ఉంటుంది.

ఓవర్‌నైట్ ఫండ్లు తరువాతి రోజే పరిపక్వత చెందే సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టే రకానికి చెందిన డెట్ ఫండ్లు. కాబట్టి అన్ని డెట్ ఫండ్ల కంటే వీటికి అత్యల్ప పరికత్వత కాలం ఉంటుంది. ఆవిధంగా, వీటికి అత్యల్ప వడ్డీ రేటు రిస్కు మరియు డీఫాల్ట్ రిస్కు ఉంటుంది. ఓవర్‌నైట్ ఫండ్లకు అసలు రిస్కు లేదని మీరు భావించలేక పోయినప్పటికీ, అన్ని ఫండ్లతో పోల్చి చూసినప్పడు వీటికి అత్యల్ప రిస్కు ఉంటుందని మీరు భావించడం సురక్షితం. కాబట్టి, రాబడులు ఎక్కువగా ఉండాలనే ఆశ లేకుండా మూలధనం సురక్షితంగా ఉండాలనే ఏకైక లక్ష్యం ఉన్నప్పుడు, అతి తక్కువ రిస్కు తీసుకుంటూ చాలా తక్కువ వ్యవధి కోసం పెద్ద మొత్తాలలో డబ్బును పార్కింగ్ చేయడానికి అవి మంచివి అని భావించబడుతుంది.

ఓవర్‌నైట్ ఫండ్లు పెద్ద మొత్తాలలో నగదు ఉన్న పెద్ద సంస్థలకు మాత్రమే అనుకూలమైనవి కావు, ఇవి తమ లిక్విడ్ డబ్బును తక్కువ వ్యవధి కోసం పెట్టుబడి పెట్టాలనుకునే చిన్న పెట్టుబడిదారులకు కూడా అనుకూలమైనవి.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను