మ్యూచువల్ ఫండ్ స్కీమ్లలో పెట్టుబడి పెట్టడం ఎలా?

Video

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం ఇప్పుడు చాలా సులువు మరియు సరళం అయిపోయింది, ఎక్కువ అదనపు డాక్యుమెంటేషన్ లేకుండా ఎన్ని ఫండ్స్లోనైనా పెట్టుబడి పెట్టడం గురించి మీరు ఆలోచించగలరు. మొదటిసారి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ఒకేసారి చేయవలసిన ప్రక్రియ అయిన KYC  పూర్తి చేయవలసి ఉంటుంది. KYC వెరిఫికేషన్ పూర్తి చేయడంలో మీకు సహాయం చేయడానికి మీరు ఒక డిస్టిబ్యూటర్ను గానీ లేదా పెట్టుబడి సలహాదారును గానీ సంప్రదించవచ్చు లేదా మీరు ఆన్లైన్లో e-KYC చేయవచ్చు. KYC మ్యూచువల్ ఫండ్స్ ప్రపంచంలోకి ప్రవేశించడానికి తాళం చెవి లాంటింది. ఒకసారి మీరు మీ KYC పూర్తి చేసిన తర్వాత, ప్రతి పెట్టుబడికి మళ్లీ వెరిఫికేషన్ అవసరం లేకుండా మీరు ఏ ఫండ్లోనైనా పెట్టుబడి పెట్టడాన్ని ఎంచుకోవచ్చు.

KYC వెరిఫికేషన్ తర్వాత పెట్టుబడి పెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నప్పుడు, మ్యూచువల్ ఫండ్ డిస్టిబ్యూటర్, రిజిస్టర్ చేయబడిన పెట్టుబడి సలహాదారు, స్టాక్ మార్కెట్ బ్రోకర్ లేదా ఇతర ఆర్థిక వ్యవహారాల మధ్యవర్తి సహాయంతో పెట్టుబడి పెట్టడాన్ని మీరు ఎంచుకోవచ్చు.  కానీ మీరే సొంతంగా పెట్టుబడి పెట్టాలనుకుంటే, మీరు మీ సమీపం లోని ఫండ్ హౌస్ కార్యాలయాన్ని సందర్శించవచ్చు లేదా ఆన్లైన్లో పెట్టుబడి పెట్టడానికి వారి సందర్శించవచ్చు లేదా ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫారం ద్వారా అయినా పెట్టుబడి పెట్టుబడి పెట్టవచ్చు.  

నేరుగా పెట్టుబడి పెట్టడమా లేదా ఒక డిస్టిబ్యూటర్ ద్వారా పెట్టుబడి పెట్టడమా అనే ఎంపిక వ్యక్తిగతం. సొంతంగా మీ పెట్టుబడులను నిర్వహించగల వ్యక్తి అయితే, ఫండ్ వెబ్సైట్ ద్వారా గానీ లేదా ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా గానీ మీరు తప్పక పెట్టుబడి పెట్టవచ్చు.  కానీ మీరు సలహా తీసుకోవాలనుకుంటే లేదా పెట్టుబడి పెట్టడంలో సహాయం అవసరమైతే, డిస్టిబ్యూటర్, పెట్టుబడి సలహాదారు, బ్యాంకు మొదలైన ఒక మధ్యవర్తి ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను