ఇండెక్స్ ఫండ్స్ మరియు వాటితో ఉన్న రిస్క్లు

Video

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

ఇండెక్స్ ఫండ్స్ నిష్క్రియంగా నిర్వహించబడే మ్యూచువల్ఫండ్స్, అవి సెన్సెక్స్ లేదా నిఫ్టీ లాంటి ప్రఖ్యాత మార్కెట్ ఇండెక్స్ను కాపీ మాత్రమే చేస్తాయి. సక్రియంగా నిర్వహించబడే ఫండ్స్తో పోల్చినప్పుడు ఇండెక్స్ ఫండ్స్కు సాపేక్షంగా తక్కువ మార్కెట్ రిస్క్ ఉన్నప్పటికీ, ఫండ్ మేనేజరుకు చురుకైన కరెక్షన్లను నిర్వహించడానికి పరిమిత సామర్థ్యం ఉంటుంది, ఎందుకంటే ఈ ఫండ్ ఇండెక్స్లో అన్ని సెక్యూరిటీలు అదే నిష్పత్తిలోనే తప్పక ఉండాలి. ఈ మార్కెట్ కరెక్షన్ల ప్రయోజనం తీసుకోవడానికి అతడు/ఆమె తక్కువ ధర ఉన్న స్టాక్ కొనలేరు లేదా ఎక్కువ ధర ఉన్న స్టాక్ అమ్మలేరు. 

ఇండెక్స్ ఫండ్స్ నిర్దిష్ట మార్కెట్ ఇండెక్స్లను ట్రాక్ చేస్తాయి కాబట్టి, ఒక నిర్దిష్ట మార్కెట్ సెగ్మెంట్ లోపల, అవి లార్జ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ , మల్టీ క్యాప్స్, బ్యాంకింగ్ స్టాక్స్, కార్పోరేట్ బాండ్స్ మొదలైనవి ఏవైనా, అవి ఎస్టాబ్లిష్ అయిన సెక్యూరిటీల ఒక పోర్ట్ఫోలియోకు పరిమితం అవుతాయి. ఆవిధంగా, అవి పెట్టుబడి పెట్టేవారి ఎంపిక ప్రపంచాన్ని పరిమితం చేస్తాయి. 

ఒక మార్కెట్ ఇండెక్స్ను అనుకరిస్తున్నప్పటికీ, ఈ ఫండ్స్ ట్రాకింగ్ తప్పిదం కారణంగా మార్కెట్ ఇండెక్స్ లాగా అదే రిటర్న్ అందించవు. తన కంపోజిషన్ మార్చుకున్నప్పుడు ఒక మార్కెట్ ఇండెక్స్కు ఏ ఖర్చూ ఉండదు, అంటే దానిలో ఒక సెక్యూరిటీ చేర్చినా లేదా దాని నుండి తీసివేసినా. ఇండెక్స్ను ప్రతిబింబించేలా తన పోర్ట్పోలియోను చేయడానికి ఒక ఇండెక్స్ ఫండ్కు లావాదేవి ఖర్చు భరించవలసి ఉంటుంది. అంతేకాకుండా, ఒక ఇండెక్స్ లోని స్టాక్లు లేదా వేరువేరు స్టాక్ల వెయిటేజ్లో కొంత మార్పు జరిగినప్పుడు సమయ జాప్యం ఉండగలదు. ఇది దాని ఇండెక్స్ రిటర్న్తో పోల్చితే ఇండెక్స్ ఫండ్ రిటర్న్ను తగ్గిస్తుంది. 

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను