ఇన్వెస్టర్ రిస్క్ ప్రొఫైల్ మరియు తగిన మ్యూచువల్ ఫండ్స్ పథకాలు

ఇన్వెస్టర్ రిస్క్ ప్రొఫైల్ మరియు తగిన మ్యూచువల్ ఫండ్స్ పథకాలు zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

పెట్టుబడుల విషయానికి వస్తే, ఒక్కొకరు ఒక్కో విధమైన ఆర్థిక లక్ష్యాలు మరియు రిస్క్ సామర్ధ్యాలను కలిగి ఉంటారు. మీ పెట్టుబడుల ఎంపిక, దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక లక్ష్యాల గురించి మీకు ఉన్న ఆలోచనపై ఆధారపడి ఉంటుంది. ఈ కారకాలు మీ పెట్టుబడి ఎంపికలు మరియు విధానాన్ని లోతుగా ప్రభావితం చేస్తాయి. రిస్క్-ఓ-మీటర్ తగిన పథకం కోసం మీ శోధనను కుదించడానికి ఒక సాధనంగా పనిచేస్తుంది.

కొత్త రిస్క్-ఓ-మీటర్ؚను అర్థం చేసుకోవడం

రిస్క్-ఓ-మీటర్ యొక్క వినూత్న అంశం దాని రిస్క్ గ్రేడింగ్ విధానంలో ఉంది. ఫండ్ కేటగిరీలను వివిధ రిస్క్ గ్రేడ్‌లతో ముడిపెట్టిన మునుపటి రిస్క్-ఓ-మీటర్ మాదిరిగా కాకుండా, కొత్త రిస్క్-ఓ-మీటర్ ఫండ్ؚలో ఉన్న నిర్దిష్ట అసెట్స్ నుండి దాని రిస్క్ మదింపులను పొందుతుంది. అంటే ఒక నిర్దిష్ట ఫండ్ పథకానికి కేటాయించిన రిస్క్ గ్రేడ్ ఆ పథకం యొక్క అంతర్లీన అసెట్స్ మరియు వాటి కేంద్రీకరణ పై ఆధారపడి ఉంటుంది. ఈ మార్పు, రిస్క్ మదింపును వాస్తవానికి దగ్గరగా తీసుకువస్తుంది, ఎందుకంటే ఇది ఫండ్ కలిగి ఉన్న అసెట్స్ؚతో ముడిపడి ఉన్న వాస్తవ నష్టాలను పరిగణనలోకి తీసుకుంటుంది.

తగిన మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ఎంచుకోవడం

మీ పెట్టుబడి లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యం మరియు కాలపరిమితితో పాటు, రిస్క్-ఓ-మీటర్ యొక్క రీడింగులు మీ ప్రమాణాలకు తగిన విధంగా సరిపోయే పెట్టుబడులను సూచిస్తాయి.

ఉదాహరణకు, ఓవర్నైట్ మరియు ఆర్బిట్రేజ్ ఫండ్స్ వంటి తక్కువ-రిస్క్ కలిగిన మ్యూచువల్ ఫండ్‌లు స్వల్పకాలంలో తక్కువ రిస్క్ ఎక్స్పోజర్ؚతో మూలధన సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చే పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటాయి.

మరోవైపు దీర్ఘకాలంలో గరిష్ట రాబడుల కోసం ప్రయత్నించే ఇన్వెస్టర్‌లకు తమ మూలధనాన్ని రిస్క్ చేసి 'వెరీ హై' రిస్క్ కేటగిరీ కిందకు వచ్చే మ్యూచువల్ ఫండ్స్ పథకాలు బాగా సరిపోతాయి.

మరింత సమాచారం కోసం, ఎడమ వైపున ఇవ్వబడిన పట్టికను చూడండి.

అయితే, కేవలం రిస్క్ కేటగిరీ ఆధారంగా ఇన్వెస్ట్మెంట్ ను ఎంచుకోవడం ముఖ్యం కాదు. బదులుగా, ప్రతి కేటగిరీలోని నిర్దిష్ట పథకాలను లోతుగా మరియు జాగ్రత్తగా అంచనా వేయడం చాలా ముఖ్యం. గుర్తుంచుకోండి, ఒకే రిస్క్ కేటగిరీలోని అన్ని ఫండ్‌లు ఒకేలా ఉండవు. అవి ప్రత్యేకమైన వ్యూహాలు, హోల్డింగ్స్ మరియు సంభావ్య ఫలితాలను కలిగి ఉండవచ్చు. అందువల్ల, మీ ఆర్థిక లక్ష్యాలు మరియు రిస్క్ టాలరెన్స్ؚకు అత్యంత సమర్థవంతంగా సరిపోయే పెట్టుబడి పథకాన్ని క్షుణ్ణంగా విశ్లేషించి ఎంచుకోవాలని సిఫార్సు చేయబడింది. మీకు సహాయం అవసరమైతే, ఆర్థిక నిపుణుడి సహాయం పొందడానికి వెనుకాడకండి.

Disclaimer

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.

పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను