ఆన్‌లైన్‌లో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం సురక్షితమేనా?

ఆన్‌లైన్‌లో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం సురక్షితమేనా?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మొదటిసారి మీరు విమానం ఎక్కడం గుర్తుందా? మీ పొట్టలో శీతాకోక చిలుకలు ఎగురుతున్నట్లు లేదా కడుపులో తిప్పినట్లు అనిపించిందా? ఇక, విమానం గాలిలోకి ఎగిరినప్పుడు, మీకు భరోసాగా అనిపించలేదా? సమర్థవంతుడైన పైలెట్, ప్రేమగా చూసుకునే క్యాబిన్ సిబ్బంది మీ సంరక్షణ చూసుకుంటుంటే, సీటు బెల్టు పెట్టుకుని 30,000 అడుగుల ఎత్తులో ఎగురుతూ ఉండడం.

ఆన్‌లైన్‌లో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం అనేది మొదటిసారి విమానం ఎక్కడంతో ఏ మాత్రం భిన్నమైనది కాదు. మీ డబ్బు ఎక్కడికి పోతుందో, అది చేరవలసిన గ్రహీతకు చేరిందా అని మొదట్లో మీకు ఆందోళనగా ఉండవచ్చు, అయినప్పటికీ ఆన్‌లైన్ పద్ధతి ఏవైనా ఇతర పద్ధతుల మాదిరిగానే సురక్షితమైంది. డేటా ట్రాన్సిమిషన్ సమయంలో మీ వ్యక్తిగత, ఆర్థిక సంబంధిత వివరాలను ఇతరులు పసిగట్టకుండా అవసరమైన ఎన్‌క్రిప్షన్ ప్రోటోకాల్స్‌తో ఆన్‌లైన్ చెల్లింపు ప్లాట్‌పారాలు సురక్షితం చేయబడి ఉంటాయి.

ఆన్‌లైన్ ప్రక్రియ ఎంతో అనుకూలమైంది, ఎందుకంటే మీరు మీ లావాదేవీలను అన్నింటినీ యాక్సెస్ చేయవచ్చు, ఏ సమయంలోనైనా కొనవచ్చు లేదా అమ్మవచ్చు మరియు మీ పోర్ట్‌ఫోలియో ఎలా పనిచేస్తున్నదో చూడవచ్చు. మీరు ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టినప్పుడు, మీ డబ్బు నేరుగా మ్యూచువల్ ఫండ్ అకౌంటు లోకి క్రెడిట్ అవుతుంది, అది మీకు యూనిట్లను కేటాయిస్తుంది, మీరు మీ అకౌంటులోకి లాగిన్ అయ్యి వాటిని చూడవచ్చు. కాబట్టి భద్రత, అనుకూలతలు మాత్రమే కాకుండా, ఆన్‌లైన్ పద్ధతి మీకు ఆఫ్‌లైన్ పద్ధతి లాగే పారదర్శకతను కూడా ఇస్తుంది. సిస్టమ్‌లో మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది!

407
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను