PPF మరియు మ్యూచువల్ ఫండ్‌ల మధ్య వ్యత్యాసాలను తెలుసుకోండి

PPF మరియు మ్యూచువల్ ఫండ్‌ల మధ్య వ్యత్యాసాలను తెలుసుకోండి zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

PPF (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) మరియు మ్యూచువల్ ఫండ్‌లు రెండు ప్రసిద్ధ పెట్టుబడి ఎంపికలు. ఈ రెండు పెట్టుబడి ఎంపికల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. 

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) దీర్ఘకాలిక పెట్టుబడి ఎంపిక, దీనికి భారత ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. PPF పెట్టుబడిదారులకు గ్యారంటీ రాబడులను అందిస్తుంది. ఈ వడ్డీ రేటును భారత ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి నిర్ణయిస్తుంది. దీనికి స్థిర పెట్టుబడి వ్యవధి కలిగి ఉంటుంది, ప్రతి ఆర్థిక సంవత్సరానికి కనిష్ట పెట్టుబడి మొత్తం రూ.500 మరియు గరిష్టంగా రూ.1.5 లక్షలు. ప్రధాన మొత్తం, సంపాదించిన వడ్డీ, PPF మెచ్యూరిటీ మొత్తం పూర్తిగా పన్ను రహితం. PPFకు 15 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో పెట్టుబడి పెట్టిన 7వ సంవత్సరం నుండి మాత్రమే ముందస్తు ఉపసంహరణలు సాధ్యమవుతాయి.  PPF తక్కువ రిస్క్ ఉన్న పెట్టుబడి ఎంపిక.

మ్యూచువల్ ఫండ్‌లు - పెట్టుబడిదారుల నుండి డబ్బును సేకరించి వృత్తిపరంగా నిర్వహించబడే పెట్టుబడి నిధులు. మ్యూచువల్ ఫండ్ స్టాక్‌లు, బాండ్‌లు మరియు ఇతర సెక్యూరిటీలు వంటి వివిధ తరగతులలో పెట్టుబడి పెడుతుంది. మ్యూచువల్ ఫండ్‌లను AMCలు (అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు) ఏర్పాటు చేసి నిర్వహిస్తాయి మరియు పెట్టుబడి పై రాబడి పెట్టుబడి పెట్టిన అంతర్లీన ఆస్తుల పనితీరుపై ఆధారపడి ఉంటుంది. 

PPF వర్సెస్ మ్యూచువల్ ఫండ్ - ప్రధాన వ్యత్యాసాలు:

  • PPF గ్యారంటీ రాబడిని అందిస్తుండగా, మ్యూచువల్ ఫండ్ రాబడులు మార్కెట్ కదలికలపై ఆధారపడి ఉంటాయి. 
  • PPFకు లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది, కొన్ని మ్యూచువల్ ఫండ్‌లు ఒక నిర్దిష్ట కాలానికి ముందే పెట్టుబడిదారుడు పెట్టుబడులను రిడీమ్ చేస్తే ఎగ్జిట్ లోడ్ؚతో వస్తాయి. లాక్-ఇన్ పీరియడ్ ఉన్న కొన్ని రకాల మ్యూచువల్ ఫండ్‌లు ఉన్నాయి.
  • PPFకు సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉంది, PPFపై వడ్డీకి పన్ను మినహాయింపు ఉంది. కేవలం ELSS మ్యూచువల్ ఫండ్‌లకు మాత్రమే సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉంటుంది, అయితే మ్యూచువల్ ఫండ్‌ల నుంచి వచ్చే రాబడులకు మూలధన లాభాల పన్ను ఉంటుంది. 
  • PPFలో రాబడులకు గ్యారంటీ ఉంటుంది, వాటికి ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. మ్యూచువల్ ఫండ్‌లపై రాబడులకు గ్యారంటీ ఉండదు మరియు మార్కెట్ రిస్క్ؚలకు లోబడి ఉంటాయి. 

ఏదేమైనా, ఏ పెట్టుబడి ఎక్కువ అనువైనదో నిర్ణయించడం పెట్టుబడిదారుని ఆర్థిక లక్ష్యాలు మరియు లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది.

డిస్క్లైమర్

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.

286
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను