మ్యూచువల్‌ ఫండ్స్ వర్సెస్ షేర్స్: తేడా ఏమిటి?

మ్యూచువల్‌ ఫండ్స్ వర్సెస్ షేర్స్: తేడా ఏమిటి?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

డిన్నర్‌కు మీరు కూరగాయలు ఎక్కడి నుంచి తెస్తారు? మీరు వాటిని మీ పెరట్లో పెంచుతారా లేదా సమీపంలోని మండి/సూపర్‌మార్కెట్ నుండి మీకు అవసరమైన దానిని బట్టి కొనుగోలు చేస్తారా? మనం స్వంతంగా కూరగాయలను పండించడం గొప్ప దారి ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి, కానీ విత్తనాలు ఎన్నుకోవడం, ఎరువులు వేయడం, నారు పోయడం, కీటకాల నివారణ మొదలగు వాటి పైన శ్రమ చేయబడుతుంది. తరువాతి ఎంపిక కష్టమైన పని లేకుండా విస్తృత రకాల నుండి ఎంచుకునే ఎంపికను అందిస్తుంది.

అదేవిధంగా, మీరు సంపదను మంచి కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్ చేసి లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి తయారు చేయవచ్చు. మనం స్టాక్సుని కొనుగోలు చేసినప్పుడు మన డబ్బుని కంపెనీలు వాటి వ్యాపారాన్ని పెంచడానికి ఉపయోగిస్తారు, అలా మన డబ్బుకి విలువను పెంచే సంపదను తయారు చేస్తుంది.

షేర్లలో నేరుగా ఇన్వెస్ట్ చేయడం చాలా ఎక్కువ రిస్క్ ఎలిమెంటుని కలిగి ఉంటుంది. మీరు కంపెనీ మరియు సెక్టారుని పరిశోధించడం ద్వారా స్టాక్సుని ఎన్నుకోవాలి. స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ చేయబడిన వేల కంపెనీల నుండి కొన్ని కంపెనీల ఎన్నుకోవడం పెద్ద పని. మీరు ఒకసారి చేసిన తరువాత, ప్రతి స్టాకు పనితీరుని ట్రాక్ చేయాలి.

మ్యూచువల్ ఫండ్స్‌లో, స్టాక్ ఎన్నుకోవడం నైపుణ్యం కలిగిన ఫండ్ మేనేజర్ల ద్వారా చేయబడుతుంది. ఫండ్ లోపల ఉన్న ఒక్కో స్టాక్సుని కాకుండా మీరు ఫండ్ పనితీరుని ట్రాక్ చేస్తూ ఉండాలి. స్టాక్సు, గ్రోత్/డివిడెండ్, టాప్-అప్స్, సిస్టమాటిక్ విత్ డ్రాయల్స్/ట్రాన్స్ఫర్స్, మొదలగు వాటిలా పెట్టుబడి పెట్టే వెసులుబాటు కాకుండా, చిన్న మొత్తాలను ఎస్ఐపిల ద్వారా రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒడుదుడుకులను అధిగమించడానికి అవి వీలుకల్పిస్తాయి.

407
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను