పోర్ట్‌ఫోలియో వైవిధ్యీకరణ ప్రయోజనాలు ఏమిటి?

పోర్ట్‌ఫోలియో వైవిధ్యీకరణ ప్రయోజనాలు ఏమిటి? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

"మీ వనరులను ఒకే చోట కేంద్రీకృతం చేయవద్దు చేయకండి".

ప్రత్యేకించి పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, రిస్క్ మరియు రాబడి మధ్య సమతుల్యతను సాధించడం కీలకం. వైవిధ్యీకరణ అనేది ఈ సమతుల్యతను సాధించడానికి ఒక కీలకమైన వ్యూహం. వివిధ అసెట్ వర్గాలు మరియు విభాగాల్లో మీ పెట్టుబడులను విస్తరించి, ఏదైనా ఒక ప్రత్యేకమైన రిస్కుకు మీరు బహిర్గతం కావడాన్ని తగ్గించేందుకు ఇది తోడ్పడుతుంది.

ప్రత్యేకించి మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి పోర్ట్‌ఫోలియో వైవిధ్యీకరణ అంటే ఏమిటో, మీరు పెట్టాలనుకుంటున్న పెట్టుబడి మీద రాబడి సాధించడానికి ఇది ఎలా సహాయపడుతుందో ఈ కథనంలో మనం చూద్దాం.

పోర్ట్ ఫోలియో వైవిధ్యీకరణ అంటే ఏమిటి?
మీరు డిన్నర్ కోసం బయటకు వెళ్లినప్పుడు, పంచభక్ష్య పరమాన్నాలతో కూడిన భోజనాన్ని తరచుగా మీరు ఆర్డర్ చేసి, ఎంతో సంతృప్తిగా తింటారు. ఒక సూప్, ఒక ఎపటైజర్, మెయిన్ కోర్స్, స్వీట్ లేదా ఐస్‌క్రీమ్, బహుశా కొన్ని డ్రింక్స్, మీరు ఆర్డర్ చేయవచ్చు చేస్తుండవచ్చు. తద్వారా వివిధ రకాల రుచులను, పదార్థాలను మీరు పొందుతారు. అంతేకాక, ఏదైనా ఒక పదార్థం సంతృప్తికరంగా లేకపోతే, మరొక పదార్థంతో సంతృప్తిని పొందే అవకాశం ఉంటుంది.

అదే విధంగా పోర్ట్ؚఫోలియో వైవిధ్యీకరణ ఉంటుంది. పోర్ట్ ఫోలియో వైవిధ్యీకరణలో రిస్క్ సర్దుబాటు చేయబడిన మెరుగైన రాబడులు అనగా రిస్క్ ని తగ్గించి, రాబడులను పెంచే ఉపకరణాల రకాలు ఉంటాయి. ఇందులో స్టాక్స్, బాండ్స్, ఉత్పత్తులు, రియల్ ఎస్టేట్, మరియు ఇతర ప్రత్యామ్నాయ పెట్టుబడుల వంటి అసెట్ వర్గాలలో మీ పెట్టుబడులను విస్తరిస్తారు. ఈక్విటీ, డెట్, ఉత్పత్తుల వంటి పలు మార్కెట్లలో నేరుగా కొనుగోలు చేయడానికి బదులుగా, ఒకే ఒక మ్యూచువల్ ఫండ్ స్కీంతో అన్నీ మార్కెట్లలో మీరు పెట్టుబడి పెట్టవచ్చు.

ఉదాహరణకు, ప్రతి వర్గానికి కనీసం 10% కేటాయించే విధంగా కనీసంగా మూడు అసెట్ వర్గాలలో మల్టీ అసెట్ యాలొకేషన్ ఫండ్స్ పెట్టుబడి పెడతాయి. అదే విధంగా, మల్టీ-క్యాప్ ఫండ్స్, వాటి పెట్టుబడులలో ఈక్విటీ కొరకు మరియు ఈక్విటీ సంబంధిత ఉపకరణాలకు వివిధ రంగాలు మరియు మార్కెట్ విభాగాలకు చెందిన స్టాక్ లకు కనీసం 65% కేటాయిస్తాయి. చిన్న మొత్తంలో స్టాక్స్, రంగాలు, లేదా విభాగాలకు అపరిమితంగా బహిర్గతం కావడం వలన కలిగే రిస్కును తగ్గించడంలో ఈ వైవిధ్యీకరణ సహాయపడుతుంది.

అంతే కాకుండా, వివిధ లక్ష్యాల కోసం వివిధ మ్యూచువల్ ఫండ్ స్కీంలలో మీరు పెట్టుబడి పెట్టవచ్చు. ఉదాహరణకు, స్వల్పకాలిక లక్ష్యాల కొరకు డెట్ ఫండ్లలో, దీర్ఘకాలిక లక్ష్యాల కొరకు ఈక్విటీ ఫండ్లలో మరియు మధ్యస్థ-కాలిక లక్ష్యాల కొరకు హైబ్రిడ్ ఫండ్స్ లో మీరు పెట్టుబడి పెట్టవచ్చు.

ఈ ఫండ్స్ లో ప్రతిదీ ఆయా ప్రయోజనాలను, వాటితో పాటు కొంత రిస్కును కలిగి ఉంటాయి. మీరు మీ లక్ష్యాలకు సంబంధించి, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టినప్పుడు, మీ సమగ్ర పోర్ట్ ఫోలియోకు రిస్కును తగ్గించుకోవచ్చు.

వైవిధ్యీకరణ అనేది వివిధ మార్కెట్ ల నుండి లాభాలు పొందే అవకాశాన్ని కూడా అందిస్తుంది. తద్వారా రిస్క్ ని తగ్గిస్తూ, రాబడిని పెంచడంలో సహాయపడుతుంది.

మ్యూచువల్ ఫండ్స్ లోనే, స్వాభావిక వైవిధ్యీకరణను అందించే వివిధ వర్గాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఉదాహరణకు మల్టీక్యాప్ ఫండ్స్ అనేవి వివిధ రంగాలు మరియు పరిశ్రమల వ్యాప్తంగా స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ మరియు లార్జ్‌క్యాప్ కంపెనీలలో పెట్టుబడి పెడతాయి. మల్టీ-క్యాప్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వలన కంపెనీ ఈక్విటీల విస్తృత శ్రేణికి ప్రవేశ సౌలభ్యం పొందడానికి తోడ్పడుతుంది. అదే విధంగా రిస్క్ సమతుల్యీకరించబడిన మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టేందుకు మీరు చూస్తున్నట్లయితే, డెట్ మరియు ఈక్విటీ పెట్టుబడుల్లో సమానంగా పెట్టుబడి పెట్టే ఒక హైబ్రిడ్ ఫండ్‌లో మీరు పెట్టుబడి పెట్టవచ్చు.

అయితే, వైవిధ్యీకరణతో విజయం సాధిస్తారు అని ఖచ్చితంగా చెప్పలేము, అలాగే నష్ట పరిరక్షణను అందించదు అనే విషయం గుర్తించుకోండి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడానికి ముందు మ్యూచువల్ ఫండ్ స్కీముల పెట్టుబడి ఉద్దేశ్యాలను పరిగణించండి.

పోర్ట్‌ఫోలియో వైవిధ్యీకరణ యొక్క ప్రయోజనాలు ఏమిటి?

1) రిస్క్ నిర్వహణ
మీరు మీ పోర్ట్ ఫోలియోనువైవిధ్యీకరించినప్పుడు, ఒక అసెట్ వర్గం సరిగ్గా పెర్ఫార్మ్ చేయనప్పుడు, ఇతర అసెట్స్ ఆ నష్టాన్ని భర్తీ చేసేలా నిర్ధారించుకోండి. అన్నీ అసెట్స్ సమానంగా పెర్ఫార్మ్ చేయవు, మరియు వైవిధ్యీకరణతో మీ రిస్కును తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు, ఈక్విటీలు సరిగ్గా పెర్ఫార్మ్ చేయనప్పుడు, డెట్ ఉపకరణాలు మరియు బంగారం సర్వసాధారణంగా చక్కటి పెర్ఫార్మెన్స్ కనబరుస్తాయి. వైవిధ్యీకరించబడిన మ్యూచువల్ ఫండ్లో మీరు పెట్టుబడి పెట్టినప్పుడు లేదా వివిధ అసెట్ల వ్యాప్తంగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు ఉండేలా ఒక పోర్ట్ ఫోలియో ఉన్నప్పుడు, మీ సమగ్ర రిస్క్, రాబడులు సమతుల్యం చేయబడతాయి.

2)  మార్కెట్ ఒడిదుడుకుల నుండి సంరక్షణ
పోర్ట్ ఫోలియో యొక్క సమగ్ర రిస్కును వైవిధ్యీకరించబడిన పోర్ట్ ఫోలియో తగ్గిస్తుంది. అసెట్ వర్గాలు మరియు పరిశ్రమల వ్యాప్తంగా పెట్టుబడిని కారణంగా మార్కెట్ ఒడిదుడుకుల పూర్తి ప్రభావం తగ్గుతుంది. రాబడులలో అత్యధిక హెచ్చుతగ్గులు ఉంటే అత్యంత రిస్కుతో కూడిన అసెట్ అని సూచిస్తాయి, దాని కారణంగా, రిస్కుతో కూడుకున్న అసెట్ల మీదరాబడులు సర్వసాధారణంగా స్వల్ప రిస్కుతో కూడుకున్న అసెట్ల మీద రాబడుల కన్నా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు, ఒకే కంపెనీకి చెందిన ఈక్విటీలు మరియు బాండ్స్‌లో మీరు పెట్టుబడి పెట్టినట్లయితే, బాండ్స్ మీద పెట్టిన పెట్టుబడి మీద వచ్చే రాబడి కన్నా ఈక్విటీల మీద పెట్టిన పెట్టుబడి మీద వచ్చే రాబడి అధికంగా ఉంటుంది. ఈక్విటీల మీద రిస్కు కూడా అధికంగా ఉంటుంది. మీ పోర్ట్‌ఫోలియోలో డెట్ మరియు ఈక్విటీ రెండింటినీ గనక మీరు చేర్చినట్లయితే, ఒక అసెట్ వర్గం నుండి వచ్చే సానుకూల రాబడులు మరొక అసెట్ వర్గం నుండి వచ్చే స్వల్ప లేదా ప్రతికూల రాబడులను పూరించే అవకాశం ఉండవచ్చు

3) లక్ష్యాలు
నిర్దిష్ట ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి వైవిధ్యీకరణ మీకు సహాయపడగలదు. కాలక్రమేణా లక్ష్యాలు మారవచ్చు. వాటిని సాధించడానికి ఫ్లెక్సిబుల్ గా ఉండే పెట్టుబడి వ్యూహాలు అవసరం కావచ్చు. ఉదాహరణకు మీరు వార్షిక సెలవు దినాలు తీసుకుందామని, రిటైర్మెంట్ కొరకు ఆదా చేద్దామని మరియు మీ పిల్లల కళాశాల ఖర్చులు చెల్లించాలని అనుకుంటున్నారు అనుకుందాం. ఉద్దేశ్యాలు మరియు కాలవ్యవధి ఆధారంగా వివిధ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మీకు కావాల్సి రావచ్చు. అవి ఈ లక్ష్యాలలో ప్రతి ఒక్కదాన్ని ప్రణాళిక చేసేందుకు మీకు సహాయపడగలవు. ఏదైనా సందేహం ఉన్నట్లయితే, మీ ఆర్థిక సంబంధిత సలహాదారును సంప్రదించండి.

4) దీర్ఘకాల పెర్ఫార్మన్స్
దీర్ఘకాలంలో, చక్కగా వైవిధ్యీకరించబడిన పోర్ట్‌ఫోలియో ఒక స్థిరమైన పెట్టుబడి అనుభవాన్ని అందించే సంభావ్యత కలిగి ఉండవచ్చు మరియు మార్కెట్ ఒడిదుడుకులకు తట్టుకుని నిలబడగలిగే చక్కటి స్థితిలో ఉండవచ్చు.

5) సమయాన్ని ఆదా చేస్తుంది మరియు సౌకర్యవంతమైనది
ప్రతి పెట్టుబడిని మీరు వ్యక్తిగతంగా పర్యవేక్షించవలసిన అవసరం ఉండదు కాబట్టివైవిధ్యీకరించబడిన మీ సమయాన్ని ఆదా చేయడంలో కూడా మీకు సహాయపడగలదు. ఇంకా చెప్పాలంటే, పోర్ట్ ఫోలియో పెర్ఫార్మెన్స్ మాత్రమే మీరు పర్యవేక్షిస్తూ, అవసరమైన సర్దుబాట్లు చేయవలసి ఉంటుంది. అవసరమైతే, మీరు ఎల్లప్పుడూ మీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ను సంప్రదించవచ్చు.

సారాంశం
రిస్కును నిర్వహించి, రాబడులను పెంచుకోవాలని చూసే ఏ మదుపుదారుడికైనా పోర్ట్ ఫోలియో వైవిధ్యీకరణ కీలకమైనది. ఆర్ధిక రంగంలో వివిధ అసెట్ వర్గాలు మరియు విభాగాలకు బహిర్గతం చేయగల వివిధ మ్యూచువల్ ఫండ్ స్కీంలలో పెట్టుబడి పెట్టడం వలన మార్కెట్ ఒడిదుడుకులను, ఆర్ధిక సంబంధిత అనిశ్చితిని తగ్గించి, దీర్ఘకాలిక ఆర్ధిక లక్ష్యాలను సాధించే అవకాశాన్ని పెంచుకోవచ్చు.

డిస్క్లైమర్ 

AMFI వెబ్‌సైట్‌లో మ్యూచువల్ ఫండ్‌ల వివిధ వర్గాల గురించి ప్రచురించిన సమాచారం, ఒక ఆర్ధిక సంబంధిత ఉత్పాదక వర్గంగా మ్యూచువల్ ఫండ్స్ గురించి అవగాహన ఏర్పరచేందుకు సమాచార సంబంధిత ప్రయోజనాల కోసం మాత్రమే కానీ విక్రయాల ప్రమోషన్ లేదా వ్యాపార అభ్యర్ధనల కోసం మాత్రం కాదు.

బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గత మూలాలు, ఇతర విశ్వసనీయమైన తృతీయ వర్గపు మూలాల ఆధారంగా ఈ సమాచారం AMFI ద్వారా తయారుచేయబడింది. అయినప్పటికీ, అటువంటి సమాచార ఖచ్చితత్వానికి, దాని సంపూర్ణతకు AMFI ఎటువంటి హామీ ఇవ్వదు, లేదా అటువంటి సమాచారం మార్చబడదని వారంట్ ఇవ్వదు.

ఇక్కడి సమాచారం, ప్రతి ఒక్క మదుపుదారుని ఉద్దేశ్యాలు, రిస్కు కాంక్షలు, లేదా ఆర్ధిక సంబంధిత అవసరాలు లేదా పరిస్థితులు లేదా ఇక్కడ విశదపరచిన మ్యూచువల్ ఫండ్ ఉత్పత్తుల పొందికలను పరిగణనలోకి తీసుకోదు. తద్వారా, దీనికి సంబంధించి పెట్టుబడి సలహా కొరకు తమ తమ ప్రొఫెషనల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్/కన్సల్టెంట్/ట్యాక్స్ అడ్వైజర్ లను మదుపరులు సంప్రదించవలసిందిగా సూచించడమైనది.

ఒక మ్యూచువల్ ఫండ్ స్కీం అనేది ఒక డిపాజిట్ ఉత్పత్తి కాదు, మరియు అది మ్యూచువల్ ఫండ్ లేదా దాని ఎఎంసికి లోబడి ఉండదు, లేదా వారి చేత హామీగానీ, రక్షణను గానీ అందించబడదు. సంబంధిత పెట్టుబడుల స్వభావం కారణంగా, ఒక మ్యూచువల్ ఫండ్ ఉత్పత్తి రాబడులు లేదా సంభావ్య రాబడులు హామీ ఇవ్వబడవు.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.

285
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను