నేను ఒక ETFలో పెట్టుబడి పెట్టాలా?

నేను ఒక ETFలో పెట్టుబడి పెట్టాలా? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

ETFలు స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించడానికి స్వల్ప ఖర్చుతో కూడుకున్న మార్గాలు. అవి ఒక ఎక్స్ఛేంజ్లో లిస్ట్ చేయబడి ఉండి, స్టాక్‌ల లాగే ట్రేడ్ ఆవుతాయి కాబట్టి, అవి లిక్విడిటీ మరియు రియల్ టైమ్ సెటిల్‌మెంట్‌ను అందిస్తాయి. ETFలు స్వల్ప రిస్కుతో కూడుకున్న ఆప్షన్లు, ఎందుకంటే అవి ఒక స్టాక్ సూచీని ప్రతిరూపకల్పన చేసి, మీరు ఎంచుకున్న కొద్ది స్టాక్లో పెట్టుబడి పెట్టడానికి విరుద్ధంగా వైవిధ్యీకరణను అందిస్తాయి.

ETFలు మీరు ట్రేడింగ్ చేయాలనుకునే మార్గంలో సెల్లింగ్ షార్ట్ లేదా  మార్జిన్లతో కొనడం వంటి ఫ్లెక్సిబిలిటీ అందిస్తాయి,. ETFలు కమోడిటీలలో మరియు అంతర్జాతీయ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడం వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడి ఆప్షన్లకు యాక్సెస్ను కూడా అందిస్తాయి. మీ స్థానాన్ని పరిరక్షించుకునేందుకు ఫ్యూచర్లను, ఆప్షన్లను కూడా మీరు ఉపయోగించుకోవచ్చు, ఇవి మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడంలో ఉండవు.

అయితే, ETFలు ప్రతి మదుపరునికీ తగినవి కావు. స్వల్ప రిస్క్ ఆప్షన్ ద్వారా దీర్ఘకాలం కొరకు ఈక్విటీ ఇన్వెస్టింగ్ ప్రయోజనాలను అనుభవించాలని కొరుకునే కొత్త మదుపరులకు ఇండెక్స్ ఫండ్స్ మెరుగైన ఆప్షన్. ‌ఏకమొత్తంలో నగదు కలిగి ఉండి, దాన్ని ఎలా పెట్టుబడి పెట్టాలి అనేది ఇంకా నిర్ణయించుకోవలసిన వారికి కూడా ETFలు తగినవి. ప్రస్తుతానికి వారు ETFలో పెట్టుబడి పెట్టి, నగదును తగినవిధంగా నియోగించేంత వరకు కొంత రాబడిని సంపాదించవచ్చు. సరైన ETFను ఎంచుకోవడానికి రిటైల్ మదుపరులు ఎక్కువ మంది కలిగి ఉండే అవగాహన కన్నా కూడా ఆర్ధిక సంబంధింత ట్రేడింగ్ మీద చక్కటి అవగాహన అవసరం. కాబట్టి, మీ ETF పెట్టుబడులను నిర్వహించేందుకు కొంత హ్యాండ్సాన్ పెట్టుబడి తప్పనిసరి.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను