మ్యూచువల్ ఫండ్ పనితీరు కోసం ఏదైనా డ్యాష్బోర్డు ఉందా?

Video
Check SCHEME Performance

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మీరు పెట్టుబడులను గురించి ఆలోచించినప్పుడు, మనం ఎంత సంపాదిస్తాం అని అడగడం సహజమే. దీనికి జవాబు ఫిక్స్డ్ డిపాజిట్లు మరియు ఇతర సాంప్రదాయ పొదుపు స్కీముల విషయంలో నేరుగా ఉంటుంది, కానీ మ్యూచువల్ ఫండ్స్లో అలా కాదు. సాంప్రదాయ పొదుపు ఉత్పత్తులు మనకు తెలిసిన గ్యారెంటీ ఇవ్వబడిన రాబడి రేటును అందిస్తాయి. కాబట్టి మన పొదుపులను ఈ ఉత్పత్తులలో దేనిలోనైనా పెట్టడం సులువైన నిర్ణయం. కాని మ్యూచువల్ ఫండ్స్ విషయంలో, ఎంచుకోవడానికి వందలాది స్కీమ్స్ ఉండటంతో వాటి అన్నింటిని గురించి తెలుసుకోవడం మానవ సామర్థ్యానికి మించిన పని కాబట్టి ఇది సంక్లిస్టంగా అనిపిస్తుంది.

ఇక్కడే ఫండ్ పనితీరు డ్యాష్బోర్డు మంచి సదుపాయంగా ఉంటుంది. ఫండ్ పనితీరు డ్యాష్బోర్డు అనేది అన్ని ఫండ్స్కు ఒక రిపోర్టు కార్డు లాంటిది. మీరు సంబంధిత బెంచ్మార్క్తో పోల్చి వాటి గత పనితీరు, తాజా NAV మరియు రోజువారీ AUM అన్నీ ఒక్కచోట చూడగలరు. అలాంటి డ్యాష్బోర్డు పనితీరు పోల్చడానికి సంబంధించిన దృష్టికోణంలో మీ పనిని సులువు చేయగలదు, కానీ ఎంచుకోవడానికి అది ఒక్కటే ఆధారం కాకూడదు. మీ పెట్టుబడులకు సరైన ఫండ్ను ఎంచుకోవడానికి ఫండ్ రకం, ఫండ్ పెట్టుబడి లక్ష్యం, దాని రిస్క్ స్థాయి మరియు మీ రిస్క్ తీసుకునే సామర్థ్యానికి మరియు పెట్టుబడి లక్ష్యాలకు దాని అనుకూలత లాంటి అనేక ఇతర అంశాలను మీరు ఆలోచించవలసి ఉంటుంది.

అయినప్పటికీ, మరోసారి మీరు ఫండ్ పనితీరును మీరు పోల్చాలనుకున్నప్పుడు, అన్ని ఫండ్స్ ట్రాక్ రికార్డు చూడటానికి www.mutualfundssahihai.com సందర్శించి, ’మ్యూచువల్ ఫండ్ స్కీముల పనితీరు తెలుసుకోండి’ అని ఉన్న బటన్ పై క్లిక్ చేయండి చాలు.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను