నిరపేక్ష రాబడి అంటే ఏమిటి?

Video

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

తమ రియల్ ఎస్టేట్ పెట్టుబడుల గురించి జనాలు ఇలా మాట్లాడుకోవడం మీరెప్పుడైనా విన్నారా, “2004లో ఈ ఇంటిని నేను 30 లక్షలకు కొన్నాను. ఈ రోజున దాని విలువ 1.2 కోట్లు! 15 సంవత్సరాలలో అది 4 రెట్లు పెరిగింది.” ఇది నిరపేక్ష ఆదాయానికి ఒక ఉదాహరణ.

ఒక పెట్టుబడి  అంతిమ విలువను మీరు దానిని పెట్టుబడి చేసిన ధరతో పోల్చినప్పుడు, కాలక్రమేణా అనుభవించిన ఎదుగుదల నిరపేక్ష రాబడికి కొలమానం. 

ఉదాహరణకు, ఒక ఫండ్‌లో మీరు పెట్టుబడి చేసింది రూ. 5000, అది కూడా 5 సంవత్సరాల క్రితం అనుకుందాం. మీ పెట్టుబడి విలవ గనక రూ. 6000 ఉంటే నేడు, మీరు రూ.1000 లాభం పొందారు, అది మీ ఆరంభ పెట్టుబడి రూ.5000 మీద 20% నిరపేక్ష రాబడికి సమానం. 

నిరపేక్ష రాబడి యొక్క లోపం ఏంటంటే అది కాలవ్యవధిని పరిగణనలోకి తీసుకోదు. పై సందర్భంలో 20% రాబడి అంటే బాగానే ఉన్నట్లు. అయితే దానిని 5 సం.ల వ్యవధిలో సాధించినప్పుడు, అది ఆకర్షణీయంగా అనిపిస్తోందా? అయితే, 5 సంవత్సరాలకు సగటు వార్షిక రాబడిని గనక మీరు లెక్కిస్తే (CAGR), అది కేవలం 3.7% మాత్రమే. ఒక సంవత్సరం కన్నా పాత ఫండ్‌ నుండి రాబడులను లెక్కగట్టేందుకు నిరపేక్ష రాబడిని ఉపయోగిస్తారు. అన్నీ ఇతర సందర్భాలలో ఏడాది ఏడాదికి వచ్చే రాబడిని (CAGR) ఉపయోగిస్తారు, ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో ఒక పెట్టుబడి ద్వారా సంపాదించిన సగటు వార్షిక రాబడిని ఇది ఇస్తుంది.

5 సంవత్సరాలలో 20% రాబడి అద్భుతమైన రాబడి కాదనే అంశాన్ని హైలైట్ చేసేందుకు ఉదాహరణలో CAGR చూపించండి.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను