టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడంలో ఉన్న ప్రయోజనాలు ఏమిటి?

టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడంలో ఉన్న ప్రయోజనాలు ఏమిటి? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

గత కొన్ని సంవత్సరాల నుండి, పెట్టుబడిదారులు మెరుగైన పన్ను-సర్దుబాటు చేయబడిన రాబడుల కోసం ఫిక్స్డ్ డిపాజిట్లు, PPFలు మరియు పోస్టాఫీసు పొదుపు పథకాలు వంటి సాంప్రదాయ పొదుపు ఉత్పత్తుల నుండి డెట్ ఫండ్ల వైపు మళ్లుతున్నారు. అయినప్పటికీ, ఇలా మారేటప్పుడు రాబడుల అనిశ్చితి మరియు వారి అసలు పెట్టుబడి కోల్పోయే రిస్క్ యొక్క ప్రభావం వారిపై ఎక్కువగా ఉంటుంది. టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్లు (TMFలు) నిష్క్రియ డెట్ ఫండ్లు, ఇవి FMPలతో సహా ఇతర డెట్ ఫండ్లను మించి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.

మనం టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్ ప్రయోజనాలకు మారే ముందు, ఈ కేటగిరీ డెట్ ఫండ్లను నిర్వచించే లక్షణం ఏమిటో చూద్దాం. టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్లకు నిర్దిష్ట మెచ్యూరిటీ తేదీ ఉంటుంది మరియు దాని పోర్ట్ఫోలియోలోని బాండ్ల గడువు ముగింపు తేదీ ఈ మెచ్యూరిటీ తేదీతో సమన్వయం చేయబడుతుంది. ఆవిధంగా, సమయం గడుస్తున్న కొద్దీ, ఫండ్ మెచ్యూరిటీ వ్యవధి లేదా సమయం తగ్గుతూ ఉంటుంది. అంతేకాకుండా, పోర్ట్ఫోలియోలోని అన్ని బాండ్లు మెచ్యూరిటీ వరకు ఉంచబడతాయి.

TMFల మొదటి మరియు అత్యంత ఆశాజనకమైన ప్రయోజనం వడ్డీ రేటు మార్పులను నిరోధించగల వాటి సాపేక్ష శక్తి. పోర్ట్ఫోలియో మెచ్యూరిటీ వరకు ఉంచబడుతుంది మరియు తగ్గుతూ ఉండే వ్యవధిని ఉంటుంది కాబట్టి, ఇది కొనసాగే క్రమంలో వడ్డీ రేటు మార్పులకు తక్కువ సున్నితంగా ఉంటుంది. రెండవది, బాండ్ల పోర్ట్ఫోలియో మెచ్యూరిటీ వరకు ఉంచబడుతుంది కాబట్టి మిగిలిన డెట్ ఫండ్ల కంటే TMFలలో మెరుగైన రాబడి కనిపించడం ఉంటుంది. ఇది ఏ సమయ బిందువు వద్దనైనా ఫండ్ యొక్క ఈల్డ్-టు-మెచ్యూరిటీకి (YTM) అనుగుణంగా రాబడి అంచనాలను ఉంచుతుంది. మూడవది, వీటి స్వభావం ప్యాసివ్గా ఉండటం వలన, టార్గెట్ మెచ్యూరిటీ బాండ్ ఫండ్లు అంతర్గతంగా ఉన్న బాండ్ ఇండెక్స్ కంపోజిషన్ మీద ఆధారపడి తమ నిధులను వినియోగిస్తాయి. కాబట్టి ఈ ఫండ్ల పోర్ట్ఫోలియో భారతదేశంలోని అత్యధిక బాండ్ సూచికలను రూపొందించే ప్రభుత్వ సెక్యూరిటీలలో భారీగా పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతుంది. ప్రస్తుతం TMFలు ప్రభుత్వ బాండ్లు, PSU బాండ్లు మరియు స్టేట్ డెవలప్మెంట్ లోన్లలో పెట్టుబడి పెట్టడం తప్పనిసరి. ఇది ఇతర డెట్ ఫండ్లతో పోలిస్తే TMFల డిఫాల్ట్ మరియు క్రెడిట్ రిస్క్ను తగ్గిస్తుంది.

టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్లు ఓపెన్-ఎండెడ్ కాబట్టి మరియు ఇండెక్స్ ఫండ్లు లేదా ETFలుగా అందుబాటులో ఉండటం వలన, అవి తరచుగా ట్రేడ్ చేయబడని FMPల కంటే ఎక్కువ లిక్విడిటీని ఇస్తాయి. అంతేకాకుండా, పెట్టుబడిదారులు తమ పెట్టుబడి పరిధికి మెచ్యూరిటీ తేదీ అత్యుత్తమంగా సరిపోయే ఫండ్ను ఎంచుకోగలగడానికి వీలుగా అవి తమ మెచ్యూరిటీ ప్రొఫైల్ పరంగా ఎక్కువ సౌలభ్యాన్ని అందిస్తాయి. కొంత కాలం పాటు పెట్టుబడి కొనసాగించాలని చూసే మరియు స్థిరమైన రాబడిని ఆశించే పెట్టుబడిదారులు తమ కోర్ డెట్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోకు టార్గెట్ మెచ్యూరిటీ డెట్ ఇండెక్స్ ఫండ్ లేదా టార్గెట్ మెచ్యూరిటీ ETFలను జోడించడాన్ని పరిగణించాలి.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను