బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అంటే ఏమిటి?
1 నిమిషం పఠన సమయం

డైనమిక్ అసెట్ అలకేషన్ ఫండ్స్ అని కూడా పిలువబడే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీకి చెందినవి. ఈ ఫండ్స్ ఈక్విటీ, డెట్ రెండింటిలోనూ స్థిర కేటాయింపులకు పరిమితం కాకుండా ఇన్వెస్ట్ చేస్తాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఈక్విటీ, డెట్ మధ్య కేటాయింపులను సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఫండ్ మేనేజర్లకు ఉంటుంది.
ఇతర హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ విధంగా కాకుండా, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ స్కీమ్ ఆఫర్ డాక్యుమెంట్లు మరియు SEBI (మ్యూచువల్ ఫండ్స్) రెగ్యులేషన్స్ 1996కు లోబడి మార్కెట్ హెచ్చుతగ్గులకు ప్రతిస్పందనగా తమ ఈక్విటీ మరియు డెట్ మిశ్రమాన్ని డైనమిక్‌గా మార్చగలవు.
బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ ముఖ్యమైన ఫీచర్లు:
> ఫ్లెక్సిబుల్ అసెట్ అలోకేషన్ ఫండ్స్: ఈ ఫండ్స్ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా తమ స్టాక్-టు-బాండ్ నిష్పత్తిని చురుకుగా మారుస్తాయి మరియు దూకుడుగా నిర్వహించబడతాయి.
> తక్కువ అస్థిరత: స్టాక్స్ మరియు డెట్ సెక్యూరిటీలలో దాని వైవిధ్యం మార్కెట్ ఆటుపోట్ల సమయంలో కొంత స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది, ఈ ఫండ్స్ ఈక్విటీ ఫండ్స్ కంటే తక్కువ అస్థిరంగా ఉంటాయి.
> ప్రొఫెషనల్ నైపుణ్యం: ప్రతి డైనమిక్ మార్కెట్ కండిషన్లో పనితీరును ఆప్టిమైజ్ చేయడాన్ని తెలివిగా నిర్ణయించే ప్రొఫెషనల్స్ వీటిని నిర్వహిస్తారు.
> పన్ను ప్రయోజనాలు: ఒకవేళ పెట్టుబడి కనీసం 65% ఈక్విటీలలో ఉంటే, భారతదేశంలో ఈ ఫండ్స్ పన్ను ప్రయోజనాలను అందిస్తాయి. ఈ పెట్టుబడుల నుంచి పొందిన లాభాలను ఏడాదికి మించి ఉంచితే, రాబడి రూ.1 లక్ష కంటే ఎక్కువ ఉంటే 10 శాతం, ఏడాది కంటే తక్కువ కాలం ఉంచితే 15 శాతం పన్ను విధించబడుతుంది.
> డైవర్సిఫైడ్ పోర్ట్ؚఫోలియో: ఏ ఒక్క పెట్టుబడి నుండైన నష్టాలకు తక్కువ అవకాశం కల్పించడానికి ఈక్విటీ మరియు ఇతర ఋణ సాధనాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా వారు వైవిధ్యపరుస్తారు.
బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ మ్యూచువల్ ఫండ్స్ ప్యూర్ ఈక్విటీ ఫండ్స్‌తో పోలిస్తే ఇన్వెస్టర్లకు తక్కువ రిస్క్‌ను అందిస్తాయి, అదే సమయంలో వారి ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో సహాయపడతాయి. ఫండ్ నిపుణులు నిర్వహించే ఫ్లెక్సిబుల్ కేటాయింపు వ్యూహాల కారణంగా ఈ ఫండ్స్‌ను తరచుగా ఆల్-సీజన్ ఫండ్స్ అని పిలుస్తారు.
డిస్క్లైమర్
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.