SIP ప్రయోజనాలు ఏమిటి?

SIP ప్రయోజనాలు ఏమిటి? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

పెట్టుబడిదారులు SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ద్వారా మ్యూచువల్ ఫండ్‌లో నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. ప్రాథమికంగా, SIPలు లేదా క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళికలు అంటే చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం.

SIP ప్రధాన ప్రయోజనాలు:

- ఇది పెట్టుబడిదారులకు సౌకర్యవంతమైన పెట్టుబడి ఎంపిక, ఎందుకంటే వారికి పెట్టుబడి మొత్తాన్ని, పెట్టుబడి ఫ్రీక్వెన్సీని మరియు పెట్టుబడి వ్యవధిని ఎంచుకునే వీలు ఉంటుంది. చేతిలో ఏకమొత్తం మూలధనం సిద్ధంగా లేని పెట్టుబడిదారులకు ఇది సౌకర్యవంతమైన పరిష్కారం.

- పెట్టుబడిదారుడు నెలకు రూ.100/- కంటే తక్కువ మొత్తంతో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు.
- ఇది వ్యక్తులలో క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి అలవాటును పెంపొందిస్తుంది - ఇక్కడ అతను లేదా ఆమె వారు ఎంచుకున్న ఫ్రీక్వెన్సీ ప్రకారం ప్రతి రోజు, వారం, నెల లేదా త్రైమాసికానికి నిర్ణీత మొత్తాన్ని కేటాయించాల్సి ఉంటుంది. 
- రూపాయి వ్యయ సగటు SIP పెట్టుబడులకు మరో ప్రయోజనం. ఇది కాలక్రమేణా మ్యూచువల్ ఫండ్ؚలో మీ పెట్టుబడి ఖర్చును సగటున అంచనా వేయడంలో మీకు సహాయపడుతుంది. మార్కెట్ ఒడిదుడుకులను కొంతమేర తగ్గించుకోవచ్చు. 
- SIPలు దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టినప్పుడు కాంపౌండింగ్ శక్తిని అందిస్తాయి.

డిస్క్లైమర్
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.
 

285
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను