టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం వలన కలిగే నష్టాలు ఏమిటి?

టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం వలన కలిగే నష్టాలు ఏమిటి? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్ (TMFలు) అనేవి మీకు స్థిర మెచ్యూరిటీ తేదీలను అందించే ఒక రకమైన ఓపెన్-ఎండెడ్ డెట్ ఫండ్లు. ఈ ఫండ్ల పోర్ట్ఫోలియోలలో ఫండ్ల టార్గెట్  మెచ్యూరిటీ తేదీతో సమన్వయం చేయబడిన గడువు తేదీలు గల బాండ్లు ఉంటాయి మరియు అన్ని బాండ్లు మెచ్యూరిటీ వరకు ఉంచబడతాయి. ఇది వడ్డీ రేటు రిస్క్ తగ్గించడంలో సహాయపడుతుంది మరియు రాబడిని మరింత ఊహించదగినదిగా చేస్తుంది, ఈ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి ముందు పెట్టుబడిదారులు తప్పనిసరిగా TMFల లోటుపాట్లను గుర్తుంచుకోవాలి.

టార్గెట్ మెచ్యూరిటీ బాండ్ ఫండ్లు డెట్ ఫండ్ యొక్క కొత్త కేటగిరీ, కాబట్టి ఇందులో కొద్ది ఎంపికలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇది పెట్టుబడిదారునికి అందుబాటులో ఉండే మెచ్యూరిటీ ఎంపికను పరిమితం చేయవచ్చు, అంటే నిర్దిష్ట మెచ్యూరిటీ పరిధిపై గట్టి ఆసక్తిగల పెట్టుబడిదారులు అనుకూలమైన ఫండ్ను కనుగొనలేకపోవచ్చు. అదేవిధంగా, ఈ కేటగిరీకి ఆధారపడగల ఎటువంటి పనితీరు ట్రాక్ రికార్డ్ లేదు.

టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్ ప్రయోజనాలలో వడ్డీ రేటు రిస్క్ తగ్గింపు మరియు రాబడి కనిపించడం ఉన్నాయి. అయితే పెట్టుబడి పెట్టేవారు మెచ్యూరిటీ వరకు ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే మాత్రమే ఈ రెండు ప్రయోజనాలు పని చేయగలవు. కాబట్టి, అత్యవసర సమయంలో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను లిక్విడేట్ చేయవలసి వస్తే, వారు తక్కువ రాబడులు సంపాదించవచ్చు మరియు వడ్డీ రేటు అస్థిరతకు కూడా గురికావచ్చు. మీకు 5-7 సంవత్సరాల పాటూ మధ్యస్థం నుండి దీర్ఘకాలిక లక్ష్యం ఉంటేనే మరియు ఫండ్ మెచ్యూర్ అయ్యే వరకు మీరు మీ పెట్టుబడులను కొనసాగించగలిగితేనే TMFలను పరిగణించాలి.

టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్ల యొక్క అతిపెద్ద ప్రతికూలత ఏమిటంటే, పెట్టుబడిదారులు ప్రస్తుత వడ్డీ రేట్లలోకి లాక్ చేయబడతారు మరియు ప్రత్యేకించి భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉన్నప్పుడు ఇది మొత్తం రాబడిపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. ఆర్థిక వ్యవస్థ, మాంద్యం నుండి అప్పుడే బయటపడుతున్నప్పుడు లేదా ప్రభుత్వం అమలులో ఉన్న ఒక ఉద్దీపన ప్యాకేజీని ఉపసంహరించుకునే అవకాశం ఉన్నప్పుడు సాధారణంగా ఇది జరుగుతుంది, ఎందుకంటే ఈ రెండు సందర్భాలలో, వడ్డీ రేట్లు సాధారణంగా అత్యల్పంగా ఉంటాయి మరియు అందువల్ల వాటికి పెరిగే అవకాశం మాత్రమే ఉంటుంది. పెరుగుతున్న వడ్డీ రేట్లు బాండ్ ధరలు మరియు డెట్ ఫండ్ రాబడులపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.

TMFలు అంతర్గత బాండ్ ఇండెక్స్లో పెట్టుబడి పెడతాయి కాబట్టి, ఇతర ఇండెక్స్ ఫండ్ లాగానే ఈ ఫండ్లు ట్రాకింగ్ ఎర్రర్కు గురయ్యే అవకాశం ఉంది. ఈ కేటగిరీకి పనితీరు చరిత్ర లేకపోయినప్పటికీ, అంతర్గత బాండ్ సూచికలు ఒక నిర్దిష్ట TMF నుండి ఆశించిన రాబడికి సహేతుకమైన సూచికగా ఉండగలవు. అయినప్పటికీ, ట్రాకింగ్ ఎర్రర్, అంటే వాస్తవ ఫండ్ రాబడులు మరియు బెంచ్మార్క్ల రాబడి మధ్య వ్యత్యాసం అనేది ఊహించగలగటంలో ఇక్కడ అవరోధం కావచ్చు.

వీటి స్వభావం ప్యాసివ్గా ఉండటం వలన, క్రెడిట్ రేటింగ్లో మార్పు లేదా RBI వడ్డీ రేట్లను మార్చడం వంటి స్వల్పకాలిక ఋణ మార్కెట్ మార్పును దృష్టిలో ఉంచుకుని వివిధ రిస్క్లను నియంత్రించడానికి ఫండ్ మేనేజర్కు పరిమిత పరిధి ఉంటుంది. తన దృక్పథంతో సంబంధం లేకుండా మేనేజర్ అంతర్గత సూచికలోని బాండ్లను అలాగే కొనసాగించడం తప్ప వేరే మార్గం లేదు. అందువల్ల, డెట్ ఫండ్లలో స్వల్పకాలిక పెట్టుబడుల కోసం చూస్తున్న పెట్టుబడిదారులకు ఇది అనుకూలంగా ఉండకపోవచ్చు. వారు TMFలకు బదులుగా స్పల్పకాలిక మెచ్యూరిటీ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం మంచిది.

మీ పెట్టుబడి పోర్ట్ఫోలియోలో టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్లను చేర్చుకోవడానికి ముందు వాటి లాభనష్టాలను జాగ్రత్తగా బేరీజు వేసుకోవడం మంచిది. అదేవిధంగా, ETF ఫార్మాట్లో అందుబాటులో ఉన్న టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి డీమ్యాట్ ఖాతా తప్పనిసరి, కాబట్టి మీకు ఆ ఖాతా లేకుంటే అది ఒక పరిమితి కాగలదు.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను