ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

Video

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్ అనేవి మ్యూచువల్ ఫండ్ పథకాలు వీటి అంతర్లీన ఆస్తులు ప్రభుత్వ సెక్యూరిటీలు, డిబెంచర్లు, కార్పొరేట్ బాండ్లు మరియు ఇతర మనీ మార్కెట్ సాధనాలు. ఈ ఫండ్లను స్థూలంగా డెట్ ఫండ్స్ అని కూడా అంటారు. కార్పొరేట్ బాండ్ ఫండ్స్, డైనమిక్ బాండ్ ఫండ్స్, బ్యాంకింగ్ & PSU డెట్ ఫండ్స్, గిల్ట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్ మొదలైనవి ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్ కేటగిరీలోకి వస్తాయి.

ఫిక్స్డ్-ఇన్కమ్ మ్యూచువల్ ఫండ్ సాధారణంగా ఇలాంటి లక్షణాలను కలిగి ఉంటుంది:

ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్లో పెట్టుబడి పెట్టడం: బాండ్లు మరియు ఇతర ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడం ద్వారా రాబడులను ఆర్జించడం దీని లక్ష్యం. అంటే ఈ ఫండ్స్ బాండ్లను కొనుగోలు చేసి, పెట్టుబడులపై వడ్డీ ఆదాయాన్ని పొందుతాయి.

తక్కువ మార్కెట్ అస్థిరత: ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీలు తక్కువ అస్థిరతను కలిగి ఉంటాయి మరియు విభిన్న మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల తక్కువ ప్రభావితమవుతాయి.

డైవర్సిఫైడ్ పోర్ట్ؚఫోలియో: డెట్ ఫండ్స్ డెట్ మరియు మనీ మార్కెట్ సాధనాలలో (వాణిజ్య పత్రాలు, ట్రెజరీ బిల్లులు మరియు మరెన్నో) పెట్టుబడి పెడతాయి. ఇది విభిన్నమైన పోర్ట్ؚఫోలియోను కలిగి ఉన్న డెట్ ఫండ్స్ లక్షణాన్ని తెలియ చేస్తుంది మరియు బ్యాంక్ డిపాజిట్ల కంటే అధిక రాబడిని అందిస్తుంది. 

ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్ అదనపు లక్షణాలు:

  • డెట్ ఫండ్లు పథకంలోని అంతర్లీన బాండ్లు మరియు డిబెంచర్ల ద్వారా చెల్లించే వడ్డీని పొందుతాయి, వీటి ధర పెరిగే అవకాశం కూడా ఉంటుంది. 
  • అలాగే, ఈ ఫండ్లకు సాధారణంగా లాక్-ఇన్ పీరియడ్ ఉండదు. అంటే పెట్టుబడిదారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎగ్జిట్ లోడ్, ఇతర ఖర్చులకు లోబడి ఫండ్ నుంచి తమ డబ్బును ఉపసంహరించుకోవచ్చు.
  • ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్లను ఇతర మ్యూచువల్ ఫండ్స్ (ఈక్విటీలు వంటివి)తో పోలిస్తే, వీటిలో రిస్క్ తక్కువగా ఉంటుంది. ఇది మీ పోర్ట్ؚఫోలియోను సమతుల్యం చేయడం ద్వారా మరియు మొత్తం రిస్క్ؚను తగ్గించడం ద్వారా మీ పెట్టుబడి పోర్ట్ؚఫోలియోకు కొంత స్థిరత్వాన్ని ఇస్తుంది. 

అయితే, ఈ ఫండ్స్ రిస్క్ లేనివని దీని అర్థం కాదు. ఇప్పటికీ వీటితో కొంత రిస్క్ ఉంటుంది. 

డిస్క్లైమర్: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.

285
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను