ఇండెక్స్ ఫండ్ల పరిమితులు ఏమిటి?

ఇండెక్స్ ఫండ్ల పరిమితులు ఏమిటి? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

వాటి నిష్క్రియా తీరు వలన మూడు ప్రధాన ప్రతికూలతలు ఇండెక్స్ ఫండ్లలో ఉంటాయి. మార్కెట్ నష్టాలను నిర్వహించడంలో ఫండ్ మేనేజరుకు అవి ఫ్లెక్సిబిలిటీని అందించవు. ఫండ్ ద్వారా ప్రతిరూపకల్పన చేయబడుతున్న సూచీ గనక ప్రతికూల ఆర్ధిక లేదా మార్కెట్ పరిస్థితుల కారణంగా ఋణాత్మక రాబడులను అందిస్తుంటే, నష్టాన్ని మెరుగ్గా నిర్వహించేందుకు స్టాక్‌లను ఎంచుకునే ఆప్షన్‌ను ఒక క్రియాశీల ఫండ్ మేనేజర్ కలిగి ఉంటాడు. అయితే ఒక ఇండెక్స్ ఫండ్ అనేది మార్కెట్ లాభనష్టాల సమయాలలో కూడా బెంచ్‌మార్క్‌ను అనుసరించడం తప్పనిసరి.

ఫండ్ల బెంచ్‌మార్క్ మీద అదనపు రాబడి ఐన ఆల్ఫాను జెనరేట్ చేసేందుకు ఒక చురుకైన ఫండ్ మెనేజర్ ప్రయత్నిస్తాడు. కాబట్టి అదనపు రిస్కును తీసుకోవడం ద్వారా తమ బెంచ్‌మార్క్‌ కన్నా అధిక రాబడులను క్రియాశీల ఫండ్లు జెనరేట్ చేయగలవు. కానీ ఇండెక్స్ ఫండ్లు తక్కువ రిస్కు కలిగిన ఉత్పత్తులు, అవి కేవలం వాటి కింద ఉండే బెంచ్‌మార్కును అనుసరిస్తాయి. కాబట్టి బెంచ్‌మార్క్ ఇండెక్స్‌కు అదనంగా రాబడిని కోరే ఒక పెట్టుబడిదారు ఒక ఇండెక్స్ ఫండ్‌ జోలికి వెళ్ళరాదు, ఎందుకంటే అవి సగటు మార్కెట్ రాబడిని జెనరేట్ చేస్తాయి.

ఇండెక్స్ ఫండ్లు ఒక ఇండెక్స్‌ను అనుసరించి, దానికి అనుగుణంగా రాబడులను డెలివర్ చేయాల్సి ఉంటుంది, నిజ జీవితంలో ట్రాకింగ్ లోపం ఉండడం వలన చాలా వరకు ఇండెక్స్ ఫండ్లు వాటి బెంచ్‌మార్కు రాబడులను తగ్గిస్తాయి. ఒక ఇండెక్స్ ఫండ్‌ తన ఇండెక్స్ కూర్పుకు చేసే మార్పుల తర్వాత తన పోర్ట్‌ఫోలియోను సర్దుబాటు చేయవలసి వచ్చిన ప్రతిసారీ ఖర్చును భరిస్తుంది. దాని కూర్పు మారితే అటువంటి ఏ లావాదేవీకి సంబంధించిన ఖర్చులను ఇండెక్స్ భరించదు. ఇండెక్స్ ఫండ్ భరించిన లావాదేవీ ఖర్చులు, బెంచ్‌మార్క్ రాబడితో పోల్చినప్పుడు తమ రాబడిని నష్టపరుస్తాయి.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను