ఓవర్నైట్ ఫండ్స్ అంటే ఏమిటి?

Video

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

మ్యూచువల్ ఫండ్స్ అన్నిటి కంటే ఓవర్నైట్ ఫండ్స్ అత్యంత సురక్షితమైనవని భావించబడతాయి. మీరు మ్యూచువల్ ఫండ్స్కు కొత్త అయితే మరియు పూర్తి స్థాయిలో దిగడానికి ముందు వాటిని ప్రయత్నించాలనుకుంటే, ఓవర్నైట్ మ్యూచువల్ ఫండ్స్ మీకు బాగుంటాయి. 

ఓవర్నైట్ ఫండ్స్ అనేవి ఒక రకమైన ఓపెన్-ఎండెడ్ డెట్ స్కీము, ఇది మరుసటి రోజే మెచ్యూర్ అయ్యే డెట్ సెక్యూరిటీలలో పెట్టుబడి పెడతాయి. అంటే, పోర్ట్ఫోలియో లోని సెక్యూరిటీలు ప్రతిరోజూ మెచ్యూర్ అవుతాయి మరియు ఫండ్ మేనేజర్ వచ్చిన మొత్తాలను పోర్ట్ఫోలియో కోసం తరువాతి రోజు మెచ్యూర్ అయ్యే కొత్త సెక్యూరిటీలు కొనడానికి ఉపయోగిస్తారు. ఈ ఫండ్స్ లోని సెక్యూరిటీలు తరువాతి రోజే మెచ్యూర్ అవుతాయి కాబట్టి, ఈ ఫండ్స్కు మిగతా డెట్ ఫండ్స్ లాగా వడ్డీ రేటు రిస్క్ లేదా డీఫాల్ట్ రిస్క్ లాంటి వాటికి గురికావు. తక్కువ రిస్క్ ఉన్న ప్రొఫైల్ అంటే అవి అతి తక్కువ రాబడి ఇస్తాయని అర్థం.

మరోచోట వినియోగించగలిగేంత వరకు స్వల్ప సమయాలకు పెద్ద మొత్తాలలో డబ్బును నిరంతరం పార్క్ చేయవలసిన అవసరం ఉన్న వ్యాపారులు మరియు పారిశ్రామికవేత్తలకు ఓవర్నైట్ ఫండ్స్ అనుకూలమైనవి. డబ్బును కరెంట్ బ్యాంకు ఖాతాలో అలాగే వదిలేయడం కన్నా మిగులు నగదును ఒక ఓవర్నైట్ ఫండ్లో పెట్టుబడి పెట్టి కొంత రాబడి సంపాదించడం మంచిది. అత్యవసర అవసరాల కోసం కొంత డబ్బును మీరు పక్కన పెట్టాలనుకుంటే అత్యవసర నిధులను తయారు చేయడానికి కూడా అవి అనుకూలంగా ఉంటాయి. ఈ ఫండ్స్కు అత్యధిక లిక్విడిటీ కూడా ఉంటుంది కాబట్టి డబ్బు మీకు అందుబాటులో ఉంటూనే మీ పెట్టుబడి కొంత రాబడిని సంపాదిస్తుంది.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను