ETFలలో పెట్టుబడి పెట్టడం వలన కలిగే ప్రమాదాలు ఏమిటి?

ETFలలో పెట్టుబడి పెట్టడం వలన కలిగే  ప్రమాదాలు ఏమిటి?

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

తక్కువ ఖర్చుతో ETFలు వైవిధ్యభరితమైన  ప్రయోజనాలను అందిస్తాయి. ఈ  ప్రయోజనాలు ఉన్నప్పటికినీ, అటువంటి పెట్టుబడులతో ముడిపడి ఉన్న  ప్రమాదాలను కూడా గమనించాలి. ముందుగా, అంతర్జాతీయ, విదేశీ ETFలతో సహా మార్కెట్‌లో అనేక రకాల ETFలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీ అవసరాన్ని తీర్చే సరైన ETFను ఎంచుకోవడం  ఈ ETFలతో బహుశా ముడిపడి ఉన్న రాజకీయ ప్రమాదాలు మరియు లిక్విడిటీ ప్రమాదాలు వంటి అదనపు  ప్రమాదాలను నివారించడానికి కీలకం. ETF వాటి   అంతర్లీన హోల్డింగుల ఆధారంగా కౌంటర్‌పార్టీ రిస్కు, కరెన్సీ రిస్కును కూడా ఎదుర్కొనవచ్చు.

ఎందులో పెట్టుబడి పెట్టాలి మరియు పోర్ట్‌ఫోలియో నుండి మూలధనార్జనలను అవి ఎలా పంపిణీ చేస్తాయి అనే దాని ఆధారంగా ETFలు వివిధ నిర్మాణాలను కలిగి ఉండవచ్చు. ఇది మదుపరుల  పన్ను భారాన్ని ప్రభావితం చేయవచ్చు. ఉదాహరణకు, వస్తు రూప ఎక్స్ఛేంజీలను ఉపయోగించే ETFలు మూలధనార్జనను అంతిమ వినియోగదారులకు పంపిణీ చేయవు, కాగా,  డెరివేటివ్‌లు లేదా కమోడిటీలను కలిగి ఉన్న ETFలు సంక్లిష్ట నిర్మాణాలను, పన్ను చిక్కులను కలిగి ఉండవచ్చు. ఈ విషయాల గురించి మదుపరుడికి అవగాహన ఉండకపోతే, అతను కష్టాలు పడవచ్చు.

ETFలకు వైవిధ్యభరితమైన ప్రయోజనాలు ఉన్నప్పటికీ స్టాక్‌లు, ఇతర మ్యూచువల్ ఫండ్‌ల మాదిరిగానే  అవి మార్కెట్ రిస్కుకు  గురవుతాయి. ETF, ట్రాక్ చేసే సూచీ ఎంత విస్తారంగా ఉంటుందో దాని మార్కెట్ రిస్క్ అంత తక్కువగా ఉంటుంది అయితే దానిని పూర్తిగా తొలగించలేము. ETFలు ట్రాకింగ్ ఎర్రర్‌ని ఎదుర్కొంటాయి అనగా వాటి రాబడి మూలాధార సూచీ రాబడి నుండి విచలితమవుతుంది ఎందుకంటే సూచీ ఎదుర్కొనని కొన్ని వ్యయాలను ETFలు భరిస్తాయి.

402
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను